RAJ THARUN : కమెడీ ఎంటర్ టైనర్ గా “అనుభవించు రాజా” టీజర్

-

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్… ఒరేయ్ బుజ్జి గా సినిమాతో మంచి పామ్ లో ఉన్నాడు. ఇక ప్రస్తుతం హీరో రాజ్ తరుణ్ “అనుభవించు రాజా” అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా శ్రీను గవిరెడ్డి.. దర్శకత్వంలో తెరకెక్కు తుండగా… అన్నపూర్ణ స్టూడియోస్ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

గ్రామీణ కథాంశం నేపథ్యంలో కామెడీ కీ రోల్ గా తీసుకొని ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా… తాజాగా ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ టీజర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశాడు.

అంతేకాదు చిత్ర యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెబుతూ.. అనుభవించు రాజా టీజర్ ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు రామ్ చరణ్. పేకాట మరియు కోడిపందాల నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతుందని టీజర్ చూస్తుంటే అర్థం అవుతోంది. పక్క గోదావరి స్లాంగ్ లో రాజ్ తరుణ్ చెప్పిన డైలాగ్స్… ఈ సినిమా హైప్ ను మరింత పెంచేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news