అరటి పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అరటి పండు తినగానే తొక్కను తీసి అవతల పారేస్తారు. కానీ దానివల్ల చర్మానికి మేలు కలుగుతుందని తెలుసుకోరు. అరటి తొక్కలో ఉండే ఫైటో న్యూట్రియెంట్లు చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. అంతేకాదు ఇందులోని పోషకాలు చర్మాన్ని మెరిసేలా చేయడంలో సాయపడతాయి. ప్రస్తుతం అరటి తొక్క చర్మానికి ఏ విధంగా మేలు చేస్తుందో తెలుసుకుందాం.
అరటి తొక్కతో మసాజ్
ముఖంపై ముడుతలను తగ్గించడంలో అరటొ తొక్క మేలు చేస్తుంది. దీనికోసం అరటి తొక్కను తీసుకుని ముఖంపై మసాజ్ చేయాలి. దానికంటే ముందు ముఖాన్ని క్లీన్సర్ తో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత అరటి తొక్కతో మసాజ్ చేసి, 10నిమిషాల తర్వాత శుభ్రపరుచుకుంటే సరిపోతుంది.
అరటి తొక్క మాస్క్
అరటిలో పొటాషియం, మాంగనీస్, విటమిన్ బీ6, బీ12, యాంటీఆక్సిడెంట్లు సహా జింక్ పుష్కలంగా ఉంటుంది. అరటితో మాస్క్ తయారు చేసుకోవడానికి ముందుగా అరటి తొక్కను
చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించండి. అరటి తొక్కను మిక్సర్ సాయంతో మంచి మిశ్రమం అయ్యేలా రుబ్బండి. ఆ తర్వాత దానిలో ఒక చెంచా తేనె, పెరుగు కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమానికి రోజ్ వాటర్ కూడా కలుపుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై మర్దన చేయండి. కొన్ని నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపర్చుకుంటే సరిపోతుంది.