MAA ELECTION : “మా” బిల్డింగ్ నా సొంత డబ్బులతో కడతా : మంచు విష్ణు

-

మా అధ్యక్ష ఎన్నికలపై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎలక్షన్స్ ఇబ్బంది కరమైన ఎలక్షన్స్ అని.. ప్రతి ఒక్కరూ ఈ ఎలక్షన్స్ తో ఇబ్బంది పడుతున్నారన్నారు. తన ప్యానెల్ ను లాస్ట్ లో ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది అంటే లాస్ట్ వరకు ఏకగ్రీవం కోసం ట్రై చేశానని వెల్లడించారు. పెద్దలకు సెక్యూరిటీ ఇవ్వటమే ప్రథమ ప్రాధాన్యమని.. “మా” బిల్డింగ్ అనేది తన సొంత డబ్బులతో కడతానని హామీ ఇచ్చారు.

దానిలో మల్టీప్లెక్స్ , కళ్యాణ మంటపం అస్సలు కట్టబోనని.. “మా” లో ఇష్యూస్ ఏమైనా వుంటే ప్రవేట్ గా మాట్లాడుకుంటామన్నారు. తాను పదవి లో వున్నా లేకపోయినా సినిమా ఇండస్ట్రీ కోసం చివరి శ్వాస వరకు పని చేస్తానని స్పష్టం చేశారు మంచి విష్ణు. ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు వారిని ఒక్కటి చేసేది సినిమా అని.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 25 సంవత్సరాల ముందు పుట్టిందన్నారు.

సినిమా ఇండస్ట్రీలో మార్పు వస్తూనే ఉంటుందని…కానీ ఆర్టిస్టు లు మాత్రం టాలెంట్ మాత్రమే నమ్ముకుంటారని చెప్పారు. ఒక నటుడు కష్టాలు… ఒక నటుడి కే తెలుస్తుందని.. మా ప్రెసిడెంట్ పదవి ఒక రెస్పాన్స్ బులిటీ అని వెల్లడించారు. దానిని తాను తీసుకున్నానని పేర్కొన్నారు. మురళి మోహన్ గారు తనను మా ఎన్నికల్లో నిలబడమని చెప్పారన్నారు. వాళ్ళు తన మీద నమ్మకంతోనే ఆ మాట చెప్పారని తెలిపారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో వున్న వాళ్ళు మా అసోసియేషన్ ను నడపలేరని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news