ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆసక్తికర కామెంట్లు చేశారు. తన తండ్రి సంపాదించిన రూ.కోట్ల విలువ చేసే ఆస్తులు అమ్మి ప్రజా సేవ చేస్తున్నా అని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన ఇంటికి కొన్ని మార్పులు చేయిస్తున్నా అని అయితే తాను కొత్త ఇల్లు కడుతున్నా అంటూ కొందరు ప్రచారం చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అనిల్ కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అంతే కాకుండా రూ.85 కోట్లతో సర్వేపల్లి అధినికీకరణ పనులు చేయిస్తుంటే అది కూడా అనిల్ కుమార్ యాదవ్ దే అని ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో అనిల్ కుమార్ యాదవ్ ఫుల్ గా సంపాదించి మరో ఇల్లు కడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో లోనే ఆయన మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.