కేంద్రం రైతుల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ లో పీఎం కిసాస్ స్కీమ్ కూడా ఒకటి. ఈ పధకం లో చేరితే చక్కటి ప్రయోజనాలని పొందొచ్చు. ఇప్పటికే చాలా మంది రైతులు ఈ స్కీమ్ లో చేరారు. ఇంకా చేరని వాళ్ళు ఈ స్కీమ్ లో చేరి.. ఈ స్కీమ్ వలన కలిగే లాభాలని పొందొచ్చు.
చేరాలని అనుకునే వాళ్ళు ఆన్లైన్ లోనే పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా ఈ పథకంలో చేరొచ్చు. ఇది ఇలా ఉంటే ఈ స్కీమ్ లో చేరిన రైతులకి ప్రతి సంవత్సరం రూ.6 వేలు లభిస్తాయి. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో మొత్తంగా ఏడాదికి రూ.6 వేలు వస్తాయి.
అదే విధంగా కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ మాత్రమే కాకుండా పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన అనే మరో పథకం కూడా రైతుల కోసం తీసుకొచ్చింది. దీనిలో కూడా రైతులు చేరి లాభాలని పొందొచ్చు. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకం లో చేరితే రైతులకి ప్రతి నెలా రూ.3 వేలు పెన్షన్ వస్తుంది. అంటే ఏడాదికి రూ.36 వేలు పొందొచ్చు. 60 ఏళ్ల తర్వాతి నుంచి ఈ డబ్బులు వస్తాయి. ఈ స్కీమ్ లో చేరాలి అంటే కచ్చితంగా 18 నుంచి 40 ఏళ్లలోపు వయసు ఉండాలి.