IPL 2021 : ఇవాళ ఐపీఎల్‌లో డబుల్ హెడర్ మ్యాచ్‌లు

ఐపీఎల్‌ 2021 రెండో సీజన్‌ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నీలో.. 35 మ్యాచ్ లు పూర్తి కాగా… ఇవాళ మరో రెండు మ్యాచ్‌ లు జరుగనున్నాయి. ఐపీఎల్ టోర్నీలో… ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అబుదాబి వేదికగా మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడునున్నాయి. రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ షార్జా వేదికగా ఢీ కొననున్నాయి.

ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో ఓటమి పాలైన సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ జట్లు ….. ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. దీంతో మిగిలిన మ్యాచ్‌లో అన్నింటా గెలిచిన మిగతా జట్ల గెలుపు, ఓటముల పై ఆధారపడావల్సి ఉంది.

ఇక అటు ఢిల్లీ క్యాపిటల్స్‌ మరియు రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు మ్యాచ్‌ వివరాల్లోకి వస్తే…. ఈ మ్యాచ్‌ చాలా రసవత్తరంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ రెండు జట్లు… ఐపీఎల్‌ రెండో సీజన్‌ లో చెరో మ్యాచ్‌ గెలిచి… మంచి ఊపులో ఉన్నాయి. ఇక ఇవాళ్టి మ్యాచ్‌ లో ఎవరు గెలుస్తారనేది చూడాలి. కాగా.. మొదటి మ్యాచ్‌ 3.30 గంటలకు ప్రారంభం కానుండగా.. రెండో 7.30 గంటలకు ప్రారంభం కానుంది.