మా అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో నటి జీవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ప్రకాశ్ రాజ్ గారి ప్యానెల్ అంతా నామినేషన్ వేసిందని…ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికల లాగా జరుగుతున్నాయని వెల్లడించారు. విష్ణు.. మోహన్ బాబు గారి అబ్బాయి అవ్వడం వల్ల మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి లాగా చూస్తున్నారని…. చిరంజీవి గారు ఎక్కడ మాకు సపోర్ట్ అని చెప్పలేదన్నారు. చిరంజీవి అందరివాడని….ఇండస్ట్రీ వాళ్లకు చిరంజీవి ఆశీస్సులు వుంటాయని స్పష్టం చేశారు.
ఏమి జరిగినా సినిమా ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలి… చాలా హెల్డిగా ఈ ఎన్నికలు జరగాలన్నారు. ఆరోపణలు ప్రత్యారోపణలు లేకుండా డిగ్నిఫైడ్ గా జరగాలని… కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి..మొన్న పృథ్వి ఆరోపణలు చాలా చిన్న పిల్లల వ్యవహారం లాగా అనిపించిందని చురకలు అంటించారు. ఆ వ్యాఖ్యలతో తాను చాలా ఇబ్బంది పడ్డానని… తాను అసోసియేషన్ కి శక్తి వంచన లేకుండా చేశానని గుర్తు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే తలెత్తుకు తిరిగేలా వుండాలని… మంచి వాతావరణం లో ఒకరిని ఒకరు కించ పరుచు కాకుండా ఎన్నికలు జరగాలన్నారు.