పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కామెంట్

-

మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ( MAA ) ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ( MAA ) ఎన్నికల నామినేషన్ వేశారు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. ప్రకాశ్‌ రాజ్‌ తో సహా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నామినేషన్‌ వేశారు శ్రీకాంత్.
ఈ సందర్భంగా నటుడు ప్రకాష్ రాజ్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.

మా ఎన్నికల నేపథ్యం లో కాసేపటి క్రితమే నా మినేషన్స్ వేశామని.. 900 మంది ఉన్న అసోసియేషన్ ఇది అని వెల్లడించారు. ఈ మా అసోషియేషన్‌ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో… ఎవరు ఓడిపోతారో అనేది ఓటు హక్కుతో నిర్ణయిస్తారన్నారు ప్రకాశ్‌ రాజ్‌. అభివృద్ధి చేయడానికి మేము పోటీ చేస్తున్నామని… రాజకీయ పార్టీల జోక్యం ఎవరు చేస్తున్నారో తెలీదని తెలిపారు. ఇది రాజకీయ ఎలక్షన్స్ కాదని… ఇది కేవలం సినిమా ఎలక్షన్స్ అని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ మాటల్లో ఆవేశం మరియు అర్థం రెండు ఉన్నాయన్నారు ప్రకాశ్‌ రాజ్‌.

Read more RELATED
Recommended to you

Latest news