తెలంగాణలో రెడ్ అలర్ట్ కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న పేర్కొన్నారు. రానున్న 5, 6 గంటలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఎవరు కూడా బయటకు రాకూడదని హెచ్చరించారు. ఇప్పటి వరకు తెలంగాణలో 15 సెంటిమిటర్లు, హైదరాబాద్ లో మధ్యాహ్నం 3 గంటల వరకు 3.3సెంటిమిటర్ల వర్షం నమోదు అయ్యిందని వెల్లడించారు.
రాత్రి సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు హైదరాబాద్, వరంగల్, ములుగు, భూపాలపల్లి, జనగామ, సిద్దిపేట, గజ్వేల్ జిల్లాలో కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. గుల్ ఆబ్ తుఫాను తీరాన్ని తాకి బలహీన పడింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. క్రమంగా బలహీన పడి అల్పపీడనంగా మారొచ్చన్నారు. ఛత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణ మీదుగా గాలులు వీస్తుండటం కారణంగా హైదరాబాద్ పై వర్ష ప్రభావం తీవ్రంగా ఉందని.. రాబోయే రెండు రోజులు పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించారు హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న.