హైద‌రాబాద్ : గ‌ల్లంతైన సాఫ్ట్ వేర్ మృత‌దేహం ల‌భ్యం..!

భారీ వ‌ర్షాల‌కు హైద‌రాబాద్ రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. భారీగా నీరు రోడ్ల‌పైకి రావ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మ‌నికొండలో శ‌నివారం భారీ వ‌ర్షం కుర‌వ‌గా నాలాలో ఓ వ్య‌క్తి గ‌ల్లంత‌య్యాడు. శ‌నివారం రాత్రి మ‌ణికొండ గోల్డెన్ టెంపుల్ వ‌ద్ద నాలాలో గోపిశెట్టి ర‌జినీకాంత్ అనే సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గ‌ల్లంత‌య్యారు. ర‌జినీకాంత్ షాద్ న‌గ‌ర్ లోని నోవా గ్రీన్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా ప‌నిచేస్తున్నాడు. శ‌నివారం ఇంటి నుండి భ‌య‌ట‌కు వ‌చ్చిన ర‌జినీకాంత్ నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ వ‌ద్ద గ‌ల్లంత‌య్యాడు. దాంతో ఎన్డీఆర్ ఎఫ్ బృంధాలు రజినీకాంత్ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టాయి.

గోల్డెన్ టెంపుల్ నుండి నెక్కంపూర్ చెరువు వ‌ర‌కు గాలింపు చేప‌ట్ట‌గా గ‌ల్లంతైన రెండు రోజుల త‌ర‌వాత ఈ రోజు రజినీకాంత్ మృత‌దేహం ల‌భ్యం అయ్యింది. ఇదిలా ఉండ‌గా హైద‌రాబాద్ లో గ‌తంలో కూడా ఇలాంటి అనేక ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. దాంతో డ్రైనేజీ వ్య‌వ‌స్థ విష‌యంలో జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని హైద‌రాబాద్ వాసులు కోరుతున్నారు.