హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఏ నేపథ్యం లో హైదరాబాద్ నగరం లో గల లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మేయర్ గద్వాల విజయ లక్ష్మి. క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. 24 గంటల పాటు అందు బాటు లో ఉండాలన్నారని ఆదేశించారు మేయర్.
ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగవద్దని.. ప్రజల వరదల వలన ఇబ్బందులు ఎదురైతే ప్రధాన కార్యాలయం లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ 040-21111111 కు కాల్ చేయాలని కోరారు. ఈ కాల్ సెంటర్ 24 గంటల పాటు పని చేస్తుందన్నారు మేయర్ గద్వాల విజయ లక్ష్మి.
వరదల కు గురయ్యే లోతట్టు ప్రజలను ముందుగా గుర్తించి వారి కుటుంబాలకు వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని.. అలాగే వారికి కావాల్సిన బోజనం మరియు త్రాగు నీరు, వసతి కల్పించాలని పేర్కొన్నారు. ఈ విషయం లో ఎలాంటి లోటు పాట్లు ఉండ కుండా చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్ల కు ఆదేశాలు జారీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి.