కాశ్మీర్లో ఉగ్రదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్టికల్ 370, 35ఏ రద్ధు తర్వాత నుంచి రగిలిపోతున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు తరుచుగా దాడులకు తెగబడుతున్నారు. భద్రతా బలగాలు, సాధారణ పౌరులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాల చేతిలో 7 గురు ఉగ్రవాదులు మరణించిన సంఘటన మరవకు ముందే మరోమారు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. తాజగా ముగ్గురు మిలిటెంట్లు దాడులకు పాల్పడ్డారు. అనంత్ నాగ్, శ్రీనగర్ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో ఒక పౌరుడు మరణించగా, మరొకరు గాయపడ్డారు. అనంత్ నాగ్ జిల్లాలో సీఆర్పీఎఫ్ బంకర్ లక్ష్యంగా గ్రానైట్ దాడి జరిగింది. ఇదిలా ఉంటే శ్రీనగర్ ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఇటీవల కాలంలో భద్రతా బలగాల చేతిలో వరస ఎన్కౌంటర్ల చేతిలో ఉగ్రవాదులు హతం అవుతున్నారు. దాడులకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను సైన్యం మట్టుబెడుతోంది. దీంతో ఎలాగైన పెద్ద దాడి చేాయలనే ఆలోచనలో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. పుల్వామా వంటి దాడులకు చేసేందుకే ఉగ్రవాదులు మళ్లీ పథకం రచిస్తున్నట్లు ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ ద్వారా తెలిసింది.