హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి ఎన్ఎస్ యూ ఐ అధ్యక్షుడు వెంకట్ ను బరిలోకి దింపిన సంగతి తెలిసిందే.అయితే హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధిని ప్రకటించిన రోజే బల్మూర్ వెంకట్ ఆస్పత్రిలో చేరారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తలపెట్టిన విద్యార్థి నిరుద్యోగ జంగ్ కార్యక్రమంలో వెంకట్ కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఎల్బీనగర్ లో ఉన్న శ్రీకాంత్ చారి విగ్రహానికి నివాళులర్పించేందుకు రేవంత్ రెడ్డి, బల్మూర్ వెంకట్ తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అయితే ఈ కార్యక్రమం కాస్త ఉద్రిక్తంగా మారింది. అయితే ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టరు. ఈ క్రమంలో పోలీసులు లాఠీ చార్చ్ చేయగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిలో బల్మూరి వెంకట్ కూడా ఉన్నారు. వెంకట తీవ్ర అస్వస్థతకు గురై గాయాలతో కిందపడిపోయారు. దాంతో కార్యకర్తలు ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. ఇక బల్మూరి వెంకట్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఎన్నికల సమయంలో వెంకట్ అస్వస్థతకు గురవడం కాంగ్రెస్ శ్రేణులను ఆందోళన కు గురి చేస్తోంది. వెంకట్ ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
షాకింగ్ : ఐసియూ లో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్..!
-