రైల్వేలో 2,945 ఉద్యోగాలు.. వివరాలు మీకోసం..!

-

ఇండియన్ రైల్వేస్ ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. మొత్తం 2,945 ఖాళీలు ఉన్నాయి. వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, లైన్‌మెన్, వైర్‌మెన్, పెయింటర్ లాంటి పోస్ట్స్ వున్నాయి. ఈస్టర్న్ రైల్వే భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది.

అప్రెంటీస్ యాక్ట్-1961, అప్రెంటీస్‌షిప్ రూల్స్-1992 ప్రకారం ఈ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఈస్టర్న్ రైల్వే. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ పోస్టులకు 2021 అక్టోబర్ 4న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 3 చివరి తేదీ. ఇవి ఏడాది గడువు గల అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. వయస్సు వచ్చేసి 15 నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తు ఫీజు వచ్చేసి రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. ఫిట్టర్ 1,246, టర్నర్ 57, వెల్డర్ 447, మెకానికల్ 18, మెకానికల్ (డీజిల్) 98, కార్పెంటర్ 19, పెయింటర్ 22, లైన్‌మ్యాన్ (జనరల్) 49, వైర్‌మ్యాన్ 107, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్ 417, ఎలక్ట్రీషియన్ 396, మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్ 9, మెషినిస్ట్ 58. పూర్తి వివరాలని నోటిఫికేషన్ లో చూసి అప్లై చేసుకోచ్చు.

నోటిఫికేషన్ లింక్: https://imgk.timesnownews.com/media/NOTIFICATION_ACT_APPRENTICE_2020-21_0.pdf

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news