కేసీఆర్ గొర్రెలు, కేటీఆర్ బర్లు కాస్తడా? : షర్మిల ఫైర్‌

-

టీఆర్‌ఎస్‌ పార్టీ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. చట్టసభల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించడం YSR తెలంగాణ పార్టీ అంతిమ లక్ష్యమని.. బీసీలను కులవృత్తులకే పరిమితం చేస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ గొర్రెలు కాస్తరా? కేటీఆర్ బర్లు కాస్తడా?హరీశ్ రావు చేపలు పట్టుకోమంటే పట్టుకుంటాడా? అని ఫైర్‌ అయ్యారు.

బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారని.. 0.5 జనాభా ఉన్న వెలమలకు ఒక సీఎం, మూడు మంత్రి పదవులా? అని నిలదీశారు. 50శాతం ఉన్న బీసీలకు మూడే పదవులా ? ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగనీయట్లే అని ప్రశ్నించారు షర్మిల. బీసీలను గొర్లు, బర్లు, చేపలకే పరిమితం చేశారని.. కేసీఆర్ కుటుంబానికి పదవులు.. బీసీలకు గొర్లు, బర్లా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను కులవృత్తులకే పరిమితం చేస్తారా? చేనేతలకు రూ.2వేలు ఇస్తే ఆత్మగౌరవంతో బతికినట్లేనా? అని మండిపడ్డారు. బీసీ ఆత్మగౌరవ భవనాలు ఏమయ్యాయి? మేం అధికారంలోకి వచ్చిన వెంటనే స్టాండప్ బీసీ ప్రోగ్రాం అమలు చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news