తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..నేడు ఈ బిల్లులు ఆమోదం !

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభం అయ్యాయి. ఇక నేడు తెలంగాణ శాసన సభ, మండలి ఉభయ సభల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలనూ చేపట్టనున్నారు. దళిత బంధు పథకం, హైదరాబాద్ నగరంలో చెరువుల సుందరీకరణ, ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయం, హైదరాబాద్ నగరంలో దోమలు ఈగల బెడద లాంటి వాటిపై నాలుగో రోజు సమావేశాల్లో అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

అంతేకాదు…. 2 బిల్లులను శాసన సభలో చర్చించి ఆమోదానికి పెట్టనున్నారు. తెలంగాణ gst సవరణ బిల్లును.. సీఎం కేసీఆర్ చర్చించి ఆమోదానికి పెట్టనున్నారు. తెలంగాణ స్టేట్ ప్రింటింగ్ ఆఫ్ షూటింగ్ అండ్ మాల్ప్రాక్టీస్ టూల్స్ అండ్ ట్రావెల్స్. బిల్ 2021ను హోంమంత్రి మహమూద్ అలీ చర్చించి ఆమోదానికి పెడతారు. శాసనమండలిలో 4 బిల్లులను చర్చించి ఆమోదానికి పెట్టనున్నారు.

తెలంగాణ హౌసింగ్ బోర్డు సవరణ బిల్లు 2021 ను వేముల ప్రశాంత్ రెడ్డి చర్చించి ఆమోదానికి పెట్టనున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్లును నిరంజన్ రెడ్డి చర్చించి ఆమోదానికి పెట్టనున్నారు. ది నేషనల్ అకాడమీ ఆఫ్ లెగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్ యూనివర్సిటీ సవరణ బిల్లు ను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చర్చించి ఆమోదానికి పెట్టనున్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చర్చించి ఆమోదానికి పెట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news