ప్రేమిస్తున్నా అంటూ టార్చర్..భరించలేక యువతి సూసైడ్..!

-

యువకుడి వేధింపులతో తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. తల్లాడ మండలానికి చెందిన ఓ యువతి ఖమ్మం లో ఎం ఎల్ టీ సెకండ్ ఇయర్ చదువుతోంది. కరోనా కారణంగా కాలేజీ మూత పడటం తో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సులు విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమం లో కృష్ణా జిల్లా కు చెందిన మధుకర్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నా అంటూ వెంట పడ్డాడు.

ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడటం తో యువతి కాస్త చనువుగా ఉంది. ఇక కొంతకాలం తరవాత మధుకర్ వేధింపులు మొదలు పెట్టాడు. తన తో మాట్లాడిన ఫోన్ రికార్డింగ్ కు, ఫోటోలు సోషల్ మీడియాలో పెడతా అంటూ యువతిని బ్లాక్ మెయిల్ చేశాడు. నాలుగు రోజుల క్రితం యువతి ఫోన్ కూడా లాక్కున్ని బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో మనస్థాపానికి లోనై యువతి తన తల్లికి విషయం చెప్పి హాస్టల్లో సూసైడ్ చేసుకుంది. యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news