కేంద్ర ప్రభుత్వం తీరుపై శాసన మండలిలో మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేంద్రం చిన్న మధ్యతరహా పారిశ్రామిక వేత్తలను ఆదుకోవాలని అనేక మార్లు లేఖలు రాసిన పట్టించుకోలేదని… కరోనా కారణంగా msme లు మూతపడ్డాయని పేర్కొన్నారు. కేంద్రం దేశంలోని పారిశ్రామిక వేత్తలను పరిశ్రమ లను కాపాడుకోవడానికి 20లక్షల కోట్ల స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నామని ప్రకటించిందన్నారు.
కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజ్ కోసం ప్రతిరోజు వెతుకున్న వాటి ఆచూకీ ఇప్పటి వరకు తనకు దొరకలేదని ఎద్దేవా చేశారు కేటీఆర్. పరిశ్రమలకు ప్రోత్సహకలు ఏమి ఇవ్వలేదు కానీ.. gecl కింద 5,389 కోట్ల లోన్లు ఇప్పించారన్నారు.
ఇది 20 లక్షల కోట్ల ప్యాకేజ్ లో 0. 0001 శాతం అనుకుంటానని ఎద్దేవా చేశారు. కరోనా నష్టాల నుంచి పరిశ్రమలను కాపాడుకోవడానికి గొప్పలు చెప్పారు కానీ కేంద్రం ఏమి చేయలేదని మండిపడ్డారు. కేంద్రానికి నిర్మాణాత్మక మైన సూచనలు చేశామన్నారు. కేంద్రం మాత్రం కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసింది కానీ msme లకు ఏమి చేయలేదని తెలిపారు. కేంద్రం చెప్పిన 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఒక పెద్ద మిధ్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.