విడాకులు తీసుకున్నాక మహిళలు ‘భరణం’ ఎందుకు వద్దనుకుంటున్నారు? కారణాలు ఇవే..!

-

ఒకప్పుడు పెళ్ళిళ్లు చాలా బలంగా ఉండేవి. ఒక్కసారి మెడలో తాళిపడిదంటే..చచ్చేవరకూ ఆ వ్యక్తితోనే ఉండేవారు. కానీ ఈ మధ్యకాలంలో భార్యాభర్తలు మధ్య గొడవలు, ఒకరిమీద ఒకరికి నమ్మకం లేకపోవటం ఇలాంటి కారణాలు వల్ల విడాకులు తీసుకోవటం కామన్ అయిపోయింది. అయితే విడాకుల తర్వాత భరణం ఇవ్వటం ఒక సంప్రదాయం. ఒకప్పుడు విడాకులు తీసుకున్న మహిళలు భరణం తీసుకునేవారు. కానీ ఇప్పుడు భరణం తీసుకోవటానికి మహిళలు ఇష్టపడటం లేదు. ఎంత పెద్ద ఎమౌంట్ అయినా నిర్మొహమాటంగా నో చెప్పేస్తున్నారు. తాజాగా సమంతకి కూడా నాగచైతన్య 200 కోట్లు భరణంగా ఇవ్వాలనుకుంటే సమంత తిరస్కరించిందట. అయితే అధికారికంగా ఇంకా బయటకురాలేదు. ఇలా కేవలం సెలబ్రెటీలే కాదు మామూలు స్త్రీలు కూడా భరణాన్ని తిరస్కరిస్తున్నారు. ఇందుకు ముఖ్యంగా 5 కారణాలు ఉన్నాయి. అ‌వేంటో ఇప్పుడు చూద్దాం.

1. అసలు విడిపోయేదాకా వచ్చారంటే.. భార్యాభర్తల మధ్య గొడవలు ఓ రేంజ్ లో జరిగివుంటాయి. భర్త లక్షణాలపైన ఇష్టం లేకపోవటం, భర్త ప్రవర్తనపైనా విసుగు చెంది ఉంటారు. వద్దనుకోని విడాకులు తీసుకున్న భర్త ఇచ్చే డబ్బు ఎందుకు అనే భరణం తీసుకోవటానికి ఇష్టపడటంలేదు. భర్త సంపాదించే అక్రమ సంపాదనలు నచ్చనివారు కూడా ఇలా తిరస్కరిస్తూన్నారు.

2. ఈకాలంలో అమ్మాయిలు స్వతంత్రంగా బతుకుతున్నారు. విద్యారంగంలో రాణించి తమ చదువుకు తగ్గ ఉద్యోగాన్ని తెచ్చుకుని తమకాళ్ల మీద నిలబడుతున్నారు. సో భరణం అనేది విడాకులు ఇచ్చిన మహిళకు భర్త వదిలిస్తే బతకడానికి ఇచ్చే డబ్బు. కానీ భర్తతో విడాకులు తీసుకున్నా తన సంపాదించుకోగలిగిన స్థానంలో ఉంటే..ఆ మహిళలు డబ్బు తీసుకోవటానికి తిరస్కరిస్తున్నారు.

3. ఇది చాలా ముఖ్యమైనది.. హిందూ వివాహ చట్టాల ప్రకారం విడాకులు ఇచ్చిన భార్య మళ్ళీ పెళ్లి చేసుకుంటే.. ఆమెకు మాజీ భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి విడాకులు అయినా ఇంటిపేరు మార్చుకుంటే ఆమెకు భరణం ఇవ్వాల్సిన అ‌వసరం లేదు. ఒకవేల విడాకులు తీసుకున్న మహిళ వేరే పెళ్లి చేసుకోవాలనుంటే భరణం తీసుకోకూడదు.

4. భర్తపై పెంచుకున్న కోపంతో కూడా భార్య భరణం తీసుకోదు. ఇజ్జత్ కా సవాల్ అన్నట్లు ఆ ఇచ్చే డబ్బుమీదే తాను ఆధరపడటంలేదు.. తమ ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా చూసుకునే క్రమంలోనే ఈ భరణం వద్దని చెబుతున్నారట.

5. భర్త మోసగాడైతే.. సహజంగానే ఏ అమ్మాయికి అయినా అతనిపట్ల విరక్తి కలుగుతుంది. అతని డబ్బు పట్ల కూడా అదే రకమైన ఏహ్యభావం ఉంటుంది. కొందరు భర్త నుంచి భరణం కొరకపోవడానికి ఇది కూడా ఒక కారణం.

ఈ కారణాల వల్లే మహిళలు భరణం వద్దంటున్నారు. ఏదేమైన భరణం తీసుకోవటం తిరస్కరించే పరిస్థితిరావటం దురదృష్టకరమే. నూరేళ్ల బంధాన్ని మధ్యలోనే తుంచేసుకోవాలని ఎవరూ అనుకోరు.. కొన్ని పరిస్థితులవల్ల బలమైన కారణాల వల్ల విడాకులు తీసుకుంటే ఓకే..కానీ చిన్న చిన్న కారణాలకే ప్రేమించే వారిని దూరంచేసుకోవటం తెలివితక్కువ పనే అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news