మనం రోజూ చూసే ఈ లోగోల వెనుక అర్థమేంటే మీరెప్పుడైనా గమనించారా..!

-

ప్రతి కంపెనీకి ఒక లోగో ఉంటుంది. నిజానికి ఆ లోగోతో ఆ బ్రాండ్ ప్రజల మైండ్ లోకి వెళ్తుంది. మనం అనుకుంటాం మంచి కలర్, డిజైన్ చూసుకుని పెట్టిఉంటారు అని..కానీ ఆ లోగోల్లో చాలా అర్థాలు ఉంటాయి. మనం రోజు చూసే బ్రాండ్లలో కొన్ని లోగలకు అసలు అర్థం ఏంటో చూద్దాం..చాలా ఆసక్తిగా ఉంటుంది.

1. అమెజాన్

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సింబల్ చూశారా.. ఏముంది అందులో అమెజాన్ అని ఇంగ్లీష్ లో రాసి ఉంటుంది అంతే కదా అనుకుంటున్నారా.. మళ్లీ ఓసారి జాగ్రత్త గా గమనించండి. ఈ సింబల్ స్మైల్ ను సూచిస్తుంది. అలాగే, “A” లెటర్ నుంచి “Z” లెటర్ వైపు ఉన్న యారో మార్క్ ను గమనించండి. అంటే ఈ సైట్ ల్లో అయినా “A” నుంచి “Z” వరకు అన్ని వస్తువులు లభిస్తాయని అర్ధం.

2. BMW

BMW కార్ లకు ఉన్న డిమాండ్ తక్కువేమి కాదు. జెర్మనీకి చెందిన బవేరియాలో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. ఆ పేరు మీదే ఈ కంపెనీ పేరుని పెట్టారు. ఈ లోగోలో రెండు కలర్లు ఉంటాయి కదా.. బ్లూ కలర్ మరియు వైట్ కలర్ ఉంటాయి. ఈ రంగులు ఆ దేశ జండాలో ఉంటాయి. అవే రంగులను ఈ కంపెనీ లోగోలో కూడా ఉంచారు

3. యూనిలీవర్

యూనీలీవర్ కంపెనీ దాదాపు అన్ని రకాల ప్రోడక్ట్ లను అందిస్తోంది. ఫెయిర్ అండ్ లవ్లీ, లైఫ్ బాయ్, పెప్స్లోడెంట్, లక్మీ , సన్ సిల్క్, పాండ్స్.. ఇవన్నీ వేరు వేరు కంపెనీ లు కాదు. ఒకటే కంపెనీ. అదే యూనీలీవర్ కంపెనీ. ఇవన్నీ కనిపించే విధంగానే ఈ లోగోను డిజైన్ చేసారు. ఈ లోగో లో పెదాలు ఉంటాయి..అంటే ఇది బ్యూటీ ప్రొడక్ట్స్ ను సూచిస్తుంది. సన్ బొమ్మ కూడా ఉంటుంది.. అంటే సన్ సిల్క్ షాంపూను సూచిస్తుంది. ఇలా అన్ని ప్రొడక్ట్స్ ను సూచించే విధంగా ఈ లోగోను డిజైన్ చేసారట.

4. ఎస్ బీఐ

SBI
SBI

భారత్ లోని పెద్ద బ్యాంకు ఎస్ బి ఐ. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనే లోగో. తెలుపు మరియు బ్లూ కలర్ లో ఉంటుంది. నీలంతో ఉన్న చిన్న వృత్తం మరియు నిలువు వరుస కీహోల్‌ను సూచిస్తుంది, ఇది భద్రత మరియు బలానికి ప్రతీక. మధ్యలో ఉన్న తెల్ల వృత్తం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ను సూచిస్తుందట. నిలువుగా సన్నగా ఉన్న గీత పట్టణాలు మరియు నగరాల ఇరుకైన దారులను సూచిస్తుంది. అంటే మీరు ఎక్కడికి వెళ్లినా మీకు సేవ చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ఉంటుంది అనే అర్ధం వచ్చేలా ఈ లోగో ను డిజైన్ చేసారు.

5. టయోటా

టొయోటా గురించి తెలియని వారంటూ ఉండరూ. ఈ లోగో చూడ్డానికి చాలా చిత్రంగా కనిపిస్తుంది. ఈ లోగోను సరిగ్గా గమనిస్తే.. ఈ లోగోలో ఉన్న లెటర్స్ అన్ని కనిపిస్తాయి. “Toyoto” లెటర్స్ అన్ని ఈ లోగో లు ఇమిడి ఉన్నాయి.

6. డామినోజ్

డామినోస్ పిజ్జా లోగోను గమనిస్తే పైన మూడు డాట్స్ ఉంటాయి. అవేంటంటే.. మొదటి డాట్ డామినోస్ మొదటి బ్రాంచ్ కి గుర్తుగా, ఆ తరువాత వచ్చిన రెండు బ్రాంచెస్ కి రెండు డాట్ లను గుర్తుగా పెట్టారు. డామినోస్ వచ్చిన మొదట్లో.. ఎన్ని బ్రాంచెస్ ఓపెన్ చేస్తే అన్ని డాట్స్ పెడదామని అనుకున్నారు. కానీ, వేల సంఖ్యలో బ్రాంచెస్ ను ఓపెన్ చేయడంతో ఇక డాట్స్ పెట్టలేమని భావించి, ఆ మూడు డాట్స్ ని అలానే వదిలేసారు. ప్రపంచవ్యాప్తంగా డామినోస్ కి 17 వేల కంటే ఎక్కువ గానే స్టోర్స్ ఉన్నాయి. తాజాగా, ఈ లోగో నుంచి పిజ్జాను తీశారు. డామినోస్ అంటేనే పిజ్జా.. ఈ మాటను కొత్త గా చెప్పక్కర్లేదు అనే ఉద్దేశ్యం తోనే ఈ పిజ్జా అనే పదాన్ని తీసేసారు.

7. ఆడి

ఆడి లోగోలో నాలుగు రింగ్స్ ఉంటాయి కదా. ఈ నాలుగు రింగ్స్ నాలుగు కంపెనీలను సూచిస్తాయి. హార్చ్, ఆడి, డీకేడబ్లు, వాండెర్ లను సూచిస్తాయి. ఈ నాలుగు కంపెనీలు 1932 కంటే ముందు విడిగా పని చేసేవి. ఆ తరువాత ఈ నాలుగు కలిసి ఆడి యూనియన్ గా కలిసి ఏర్పడ్డాయి. ఈ నాలుగు కంపెనీలను సూచించడానికి లోగోలో నాలుగు రింగ్స్ ను పెట్టారు.

8. హుండాయ్

ఇది కూడా ఒక పాపులర్ కంపెనీ. ఈ లోగోను గమనిస్తే.. హుండాయ్ లో మొదటి అక్షరం అయిన హెచ్ ను లోగోగా పెట్టారని అందరు అనుకుంటారు. కానీ అసలు అర్ధం అది కాదు. ఇద్దరు వ్యక్తులు కరచాలనం చేసుకుంటూ ఉంటారు. వీరిలో ఒకరు హుండాయ్ కంపెనీ వ్యక్తి కాగా, మరోకరు కస్టమర్. వీరిద్దరి మధ్య సత్సంబంధాన్ని సూచిస్తూ ఈ లోగోను డిజైన్ చేసారట.

9.ఎయిర్టెల్

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ లోగో ఆ పదం లోని మొదటి అక్షరాన్ని సూచిస్తుంది. కానీ, ఇందులో కంపెనీ చూపిన అర్ధం ఏమిటంటే.. ఈ “a” అనే లెటర్ సగమే ఉంటుంది. మధ్యలో భాగం ఓపెన్ గా ఉంటుంది. అంటే ఎయిర్ టెల్ కు ఎలాంటి బౌండరీస్ లేవు అని అర్ధమట.

10. పెప్సీ

పెప్సీ కంపెనీ లోగో ను డిజైన్ చేయించుకోవడానికి వన్ మిలియన్ డాలర్లను ఖర్చు చేసిందట. ఈ లోగోలో ఉన్న రంగులు అమెరికన్ నేషనల్ ఫ్లాగ్ ను సూచిస్తాయి.

11. నైక్

ఈ లోగో కింద టిక్ మార్క్ ఉంటుంది కదా.. అంటే దీని అర్ధం స్పీడ్ అని. అథ్లెట్స్ కి కావాల్సిన వేగాన్ని ఈ కంపెనీ షూస్ అందిస్తాయని అర్ధం.

12. మెక్ డొనాల్డ్స్

మెక్ డొనాల్డ్స్ లోగో చూడగానే ఫస్ట్ లెటర్ “m” ను లోగో గా పెట్టారని అనుకుంటారు. కథవేరుంది. ఈ కంపెనీ మొదటి బ్రాంచ్ ను పెట్టినపుడు ఆ బిల్డింగ్ కి ఎల్లో కలర్ ఆర్క్ లా డిజైన్ చేసారు. ఆ తరువాత పెట్టిన అన్ని బ్రాంచెస్ కి ఇలానే పెట్టారు. ఆ ఆర్క్ లను దగ్గరకి చేస్తే ఆ లోగో “m” ఆకారం లో వచ్చింది.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news