తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీపికబురు చెప్పారు. ప్రస్తుతం దళిత బంధు పథకాన్ని కేవలం దళిత సామాజిక వర్గానికి అమలు చేస్తున్నామని చెప్పిన సీఎం కేసీఆర్… త్వరలోనే అన్ని కులాలకు దళిత బందు తరహాలోనే మరో పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. కాసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి.. పార్టీలోకి మోత్కుపల్లి నర్సింహులును ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. దళిత బంధు తీసుకురావడానికి బలమైన కారణం ఉందని.. దళిత బంధు తో ప్రారంభం అయిన ఈ యజ్ఞం ఆగదని స్పష్టం చేశారు.
ఆ తర్వాత గిరిజనులకు,బీసీలకు , ఈబీసీలకు కూడా ఉంటుందని ప్రకటించారు. ఇతర పార్టీలకు రాజకీయాలు అంటే క్రీడ… కానీ టిఆర్ఎస్ కు మాత్రం యజ్ఞం ..టాస్క్ అన్నారు. రాయచూరు బిజెపి ఎమ్మెల్యే తెలంగాణ లో కలపాలని అంటున్నారని.. దళిత బంధు కింద ఇవాళ తిరుమలగిరి మండలంకు నిధులు విడుదల చేయమని చెప్పామని పేర్కొన్నారు. రాజకీయంలో ఒకసారి గెలుస్తాం…ఒక సారి ఓడతాం ..అది పెద్ద లెక్క కాదని.. వచ్చే ఏడేళ్లలో 1 లక్ష 70 వేల కోట్లు దళిత బంధు కోసం పెడతామని ప్రకటించారు.