తెలంగాణ రైతులకు శుభవార్త… కేసీఆర్ కీలక ప్రకటన

-

తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ధాన్యం సేకరణపై తీపి కబురు చెప్పారు సీఎం. తెలంగాణలో ధాన్యాన్నిప్రభుత్వమే కొంటుందని తెలిపారు. వరిని పండించిన రైతులు ఆందోళన చెందవద్దన్నారు. మద్దతు ధర ప్రకారమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ధాన్యం సేకరణ అంశంపై రాష్ట్రంలోని రైతులు ఆందోళనతో ఉన్నారు. ప్రభుత్వం దొడ్డు వడ్లను కొనుగోలు చేయబోమని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశం రాజకీయంగా మారింది.

kcr

ప్రతిపక్షాలు, ప్రభుత్వం మధ్య కొనుగోలు అంశంపై మాటల యుద్దం జరిగింది. అయితే కేంద్రమే కొనుగోలు చేయడం లేదని టీఆర్ఎస్ ఆరోపించింది. ప్రస్తుతం జరుగుతున్న హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కూడా కొనుగోలు వ్యవహారం ప్రచారాస్త్రంగా మారింది. ఓ వైపు టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం రైతులపై వివక్ష చూపిస్తున్నారని విమర్శిస్తుంటే… బీజేపీ మాత్రం కేంద్రం ఎక్కడా కొనుగోలు చేయం అని చెప్పలేదని ప్రజలకు స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన ఢిల్లీ పర్యటనలో కూడా సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు విషయంపై పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. తాజాగా సీఎం ప్రకటనతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news