Bigg Boss 5: “నామినేష‌న్స్ అంటే మ‌జాక్ అయితుందా “.. ప్రియపై సన్నీ ఫైర్ ! నామినేషన్స్‌లో వీళ్లేనా??

-

Bigg Boss 5: బిగ్ హౌస్‌లో స‌న్ డే ఫ‌న్ డే గా సాగింది..చివ‌ర‌గా ఎవ్వ‌రూ ఊహించని విధంగా శ్వేతా ఎలిమినేట్ అయింది. ఎలిమినేష‌న్ల త‌రువాత జ‌రిగే.. ఎలిమినేషన్స్ ప్రక్రియ కొంచెం కొత్తగా జ‌రిగింది ఇక నిన్న‌టి ఎపిసోడ్ లో. వారం మొత్తం ఎంతో ఫ్రెండ్లీ గా ఉండే కంటెస్టెంట్లంద‌రూ నామినేష‌న్లు అన‌గానే.. బ‌ద్ద శ‌త్రువులుగా మారుతార‌నే విష‌యం తెలిసిందే..

నిన్నటి ఎపిసోడ్ లో కూడా అలానే జ‌రిగింది. హౌస్ మొత్తం ఒక్క‌సారిగా హీట్ ఎక్కింది. మళ్ళీ అందరి మధ్య విబేధాలు తలెత్తాయి. సిల్లీ రీజ‌న్స్ తో నామినేష‌న్ చేయ‌డం చాలా గ‌రం గ‌రంగా జ‌రిగింది. ఇక ఈవారం నామినేష‌న్ల ప‌ర్వం ఎలా జ‌రిగింది. ఎవరు నామినేట్ అయ్యారు.. ఎవరు ఎవర్ని నామినేట్ చేశారు.. ఆ దూషణల పర్వం ఎలా ఉండో చూసేద్దాం..

ఈ వారం నామినేషన్స్ ప్ర‌క్రియ చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు బిగ్ బాస్. హౌస్ ఒక్క‌సారిగా ఫారెస్ట్ గా మారింది. ఈ టాస్క్ లో సన్ని, జెస్సీ, శ్రీరామ్‌లు వేటగాళ్లుగా మారారు. మిగిలిన కంటెస్టెంట్ల వారిని నుంచి త‌ప్పించుకోవాలి. దొరికితే.. ఈ ముగ్గురూ వేటగాళ్లు వారిని షూ చేసి నామినేట్ చేస్తారు. మిగితా కంటెస్టెంట్ల‌ లక్ష్యం వేటగాళ్లని ఒప్పించి వారిని చంపకుండా కాపాడుకోగలగడం.

ఇతరుల్ని నామినేట్ చేసేట్టు చేయడం. ముగ్గురు వేటగాళ్లలో ఎక్కువ మందిని వేటాడి నామినేట్ చేసిన వేటగాడు సేవ్ అవుతాడు. మిగిలిన ఇద్దరూ నామినేట్ అవుతాడు. అలాగే సౌండ్ వచ్చిన ప్రతిసారి.. గార్డెన్ లో పెట్టిన రెండు అరటి పండ్లను పట్టుకోవాల్సి ఉంటుంది. ఏ ఇద్దరూ అయితే ఆ అరటి పండ్లను పట్టుకుంటారో వాళ్లు వేటగాడితో చర్చించి.. ఒకర్ని నామినేట్ అయ్యేలా ఒప్పించుకోవాలి.

ఇక ఈ టాస్క్ లో స‌న్నీ హంట‌ర్ గా రెచ్చిపోయాడు. బిగ్ బాస్ అడ‌విలో కంటెస్టెంట్ కోతుల‌ను వేటాడించారు. మొదటిగా జంగిల్ సౌండ్ రాగానే సిరి, షణ్ముఖ్‌లు బ‌య‌ట‌కు వ‌చ్చి.. గార్డెన్లో ఉన్న‌ అరటి పండ్లను పట్టుకున్నారు. అదే స‌మ‌యానికి హంట‌ర్ సన్నీ బయటకు వచ్చాడు. ఎవ‌ర్ని నామినేట్ చేస్తార‌ని అడ‌గ్గా.. ఒకే మాట అన్న‌ట్టుగా సిరి, షణ్ముఖ్‌లు క‌లిసి.. ఆనీ మాస్టర్‌ని నామినేట్ చేశారు.

అయిన తరువాత కాజల్ వచ్చి సిరి నామినేట్ చేసింది. అనంతరం లోపలికి వచ్చిన తరువాత అసలు కాజల్ చదువుకున్నదా? లేదా?? నామినేట్ అయ్యి నేను బాధలో ఉంటే మళ్లీ నా దగ్గరకు వచ్చి గిచ్చుతుంది.. గెలకడం బాగా అలవాటు నొప్పిలో ఉంటే గుచ్చుతుంది.. ఈసారి కత్తి తీసుకుని వెళ్లి ఇచ్చేస్తా పొడిచెయ్ అని అంటుంది.

ఆ తరువాత బజర్ మోగేసరికి సిరి, ఆనీమాస్టర్‌లు అర‌టి పండును తీసుకోవడం.. ఆనీ మాస్టర్ సిరిని నామినేట్ చేయగా.. సిరి మానస్‌ని నామినేట్ చేసింది. కానీ, సిరి చెప్పిన కారణంతో స‌న్నీ విభేదించారు. ఆ త‌రువాత‌.. స‌న్నీ సిరిని నామినేట్ చేశాడు.. దీంతో మోజ్ రూంలోకి పోయి ష‌న్ను గ్యాంగ్ మీట్ అయింది. స‌న్నీ త‌న‌ను నామినేట్ చేయ‌డంపై కుల్లుకుంది. ఈ సారి నామినేష‌న్స్‌లో కూడా రవిని మ‌రోసారి నామినేట్ చేసింది ప్రియ. సోఫా మీద ట‌వ‌ల్ ఆరేయ‌డం న‌చ్చ‌లేద‌నే సిల్లి రీజ‌న్ చెప్పింది. దీంతో రవి షాక్ అయ్యాడు.

మ‌రోసారి బ‌జ‌ర్ మోగ‌గానే.. నాలుగోసారి కూడా సన్నీ బయటకు వచ్చాడు.. ఆ స‌మ‌యంలో అరటి పండును సిరి, ప్రియ పట్టుకున్నారు. అయితే ఈసారి సిరి.. తన అరటిపండుని ప్రియాంకకు ఇచ్చింది. దీంతో ప్రియాంక రెచ్చిపోయింది. కాజల్‌ని నామినేట్ చేయగా.. ఇలా కూడా ఇవ్వొచ్చా అని సన్నీ ప్ర‌శ్నించ‌గా. తీసుకోవచ్చు అని ప్రియాంక చెప్పింది. ఈ క్ర‌మంలో స‌న్నీ, ప్రియాంక ల మధ్య పెద్ద గొడవే జరిగింది. సేఫ్ గేమ్ ఆడుతున్నారంటూ ప్రియాంకపై సీరియస్ అయింది.

ఈ మాటలు విన‌గానే ప్రియ, ప్రియాంకలు రెచ్చిపోయారు. చెత్త రీజన్స్ చెప్పి నామినేట్ చేయ‌డ‌మేంటని చిందులు తొక్కారు. ఇక ర‌వి కూడా ఏ మాత్రం త‌గ్గ‌లేదు .. స‌న్నీపై ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. అరేయ్ ఏంట్రా ఇది.. శ్వేతకి నేను సారీ చెప్పాను.. ఇది నా లైఫ్‌రా.. ఇలాంటి వాటికి నామినేట్ చేస్తావా? శ్వేతా నా వల్ల నామినేట్ అయ్యిందా? అని ర‌వి స‌న్నిని నిలదీశాడు. ఇదే స‌మ‌యంలో ప్రియ కూడా రెచ్చిపోయింది. ద‌మ్ముంటే నా ముందు మాట్లాడు..అని స‌న్నీ సీరియస్ అయ్యాడు. గేమ్ మీరాడొద్దు, నేనాడుతా ఇప్పట్నించీ, నామినేష‌న్స్ అంటే మ‌జాక్ అయితుందా అని ఫైర్ అయ్యాడు.

ఇక మొత్తం మీద ఏడోవారం నామినేషన్స్‌లో కాజల్, రవి, సిరి, ఆనీ, ప్రియ, శ్రీరామ్, జస్వంత్‌లు నిలిచారు. అలాగే వేటగాళ్లుగా ఉన్న శ్రీరామ్, జస్వంత్‌లు ఒక్కసారి బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో నేరుగా నామినేట్ అయ్యారు. వీరితోపాటు సీక్రెట్ రూంలో ఉన్న లోబో కూడా నామినేట్ అయ్యాడు. దీంతో ఈవారం నామినేషన్స్‌లో 8 మంది నిలిచారు. మరి ఈ నామినేషన్స్ నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలంటే వారం చివరి దాకా వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news