పోస్టాఫీస్ కస్టమర్లకు గుడ్ న్యూస్..!

-

చాలా మంది వాళ్ళ దగ్గర వుండే డబ్బులని బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్ లో కానీ పెడతారు. దీని వలన వాళ్లకి వడ్డీ వస్తుంది. అలానే డబ్బులు కూడా భద్రంగా ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ లో చాలా మంది డబ్బులు దాచుకుంటారు. మీరు కూడా పోస్ట్ ఆఫీస్ లో డబ్బులని దాచుకుంటారా..?, మీకు పోస్టాఫీస్‌లో అకౌంట్ ఉందా? లేదంటే ఏదైనా పథకంలో డబ్బులు పెడుతున్నారా..? అయితే మీకు శుభవార్త.

 

తాజాగా కొత్త సేవలుని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ తీసుకు రావడం జరిగింది. ఇది కూడా కస్టమర్స్ కి ఉపయోగకరం. మరి దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. కొత్త సేవలుని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ని తీసుకు వచ్చింది. అదే పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి ఐవీఆర్ సర్వీసులు ఇవ్వడం.

దీనిలో భాగంగా కస్టమర్లు స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌కు సంబంధించిన వివరాలు కూడా క్షణాల్లో పొందొచ్చు. కస్టమర్స్ దీని కోసం 18002666868 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చెయ్యాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చెయ్యాలి.

బ్యాలెన్స్ ఎంక్వైరీ, ట్రాన్సాక్షన్స్ ఎంక్వైరీ, టర్మ్ డిపాజిట్ వివరాలు, ఏటీఎం కార్డు బ్లాక్, వడ్డీ రేట్లు ఇలా మీరు మీకు నచ్చిన వివరాలు పొందొచ్చు. ఇక ఈ సర్వీసులు ఎవరు ఉపయోగించుకోవచ్చు అనేది చూస్తే.. పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ వంటి పలు స్కీమ్‌లో డబ్బులు పెట్టిన వారు వీటిని ఉపయోగించుకోవచ్చు. పైగా ఇది బెనిఫిట్ గా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news