యదాద్రి నరసింహ స్వామి ఆలయ పున ప్రారంభం తేదీలు ఖరారు అయిన సంగతి తెలిసిందే. యదాద్రి ఆలయ పునరుద్ధరణ తేదీలను నిన్న తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ప్రకటించారు. మార్చి 28 వ తేదీ 2022 వ సంవత్సరం లో మహా కుంభ సంప్రోక్షణ అంటే ఆలయ పునః ప్రారంభం కానుంది. ఇక ఈ మహా కార్యక్రమానికి 125 కిలోల బంగారం ఇందుకు అవసరమని .. చెప్పారు.
ఈ నేపథ్యంలోనే… తెలంగాణ రాష్ట్రంలోని పలుగురు వ్యాపార వేత్తలు మరియు టీఆర్‌ఎస్ నేతలు బంగారం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఇక తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన స్ఫూర్తి తో యదాద్రి విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పార్ధ సారధి రెడ్డి ఏకంగా 5 కిలోల బంగారం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. తన కుటుంబం తరఫున ఈ విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. చరిత్రలో నిలిచిపోయే గొప్ప నిర్మాణంలో తాము సైతం భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని చెప్పారు.