శ్రీవారి భక్తులకు టిటిడి గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ నుండి శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంచుతున్నట్లు ప్రకటించింది. సర్వదర్శనం 10వేల టికెట్లను.. ప్రత్యేక దర్శనం టికెట్లు 12 వేలు జారీ చేసినట్టు టిటిడి ప్రకటన విడుదల చేసింది. అంతేగాకుండా నవంబర్ నెల కు ప్రత్యేక దర్శనం టికెట్ల షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 22న ఉదయం 9 గంటలకు ప్రత్యేక దర్శనం టికెట్లు.. 23న ఉదయం 10వేల సర్వదర్శన టికెట్లను విడుదల చేస్తున్నట్టు టిటిడి స్పష్టం చేసింది.
ఇక ప్రత్యేక దర్శనానికి టికెట్ ధర రూ. 300 కాగా ఈ టోకెన్లను గోవింద యాప్ లో కాకుండా టిటిడి వెబ్సైట్ లో బుక్ చేసుకోవాలని స్పష్టంచేసింది. ఇక టిడిపి ప్రకటనతో ప్రత్యేక దర్శన టికెట్లు దొరక్క పోయినా సర్వ దర్శనం టికెట్లు తీసుకోవాలని భక్తులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తిరుమల వెళ్లే భక్తులకు టిటిడి కొత్త నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. తిరుమలకు వెళ్ళే భక్తులు రెండు డోస్ ల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అదేవిధంగా దర్శనానికి ముందు మూడు రోజులు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని ప్రకటించింది.