మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వే భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. కనుక ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ రైల్వే డివిజన్లలో ఈ అప్రెంటీస్ పోస్టులున్నాయి. సికింద్రాబాద్, కాజిపేట్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో ఉన్న రైల్వే యూనిట్లలో ఈ ఖాళీలున్నాయి.
ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. మొత్తం 4,103 పోస్టుల భర్తీకి ప్రస్తుతం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దరఖాస్తు చేయడానికి 2021 నవంబర్ 3 ఆఖరి తేదీ. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. ఇక ఎవరు అర్హులు అనేది చూస్తే.. 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. 10+2 విధానంలో చదివి ఉండాలి.
కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి పాస్ కావాలి. అలానే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) లేదా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ (SCVT) గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, డిప్లొమా హోల్డర్స్ ఈ పోస్టులకు దరఖాస్తు చేయకూడదు.
ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్థుల వయస్సు 2021 అక్టోబర్ 4 నాటికి 15 నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. ఎంపికైన వారికి ఒక ఏడాది అప్రెంటీస్ ఉంటుంది. సెంట్రల్ అప్రెంటీస్‌షిప్ కౌన్సిల్ సిలబస్ ప్రకారం శిక్షణ ఉంటుంది. పూర్తి వివరాల్ని http://20.198.104.232/instructions.php లో చూసి అప్లై చేసుకోవచ్చు.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి.