ఏపీలో తెలుగుదేశం కార్యాలయాల పై…పట్టాభి ఇంటి పై జరిగిన దాడులు దుమారం రేపుతున్నాయి. నిన్న సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పట్టాభి ని పోలీసులు ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాంతో టిడిపి నాయకులు వైసిపి నాయకులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నారు. నిన్న మీడియా సమావేశంలో సీఎం జగన్ తనను ఏమైనా అంటే తన అభిమానులకు బిపి వస్తుంది అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే సీఎం డైలాగ్ కు తాజాగా నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు.
మిమ్మల్ని అంటే వైసీపీ కార్యకర్తలకు మాత్రమే బీపీ వస్తుందేమో అదే చంద్రబాబును అంటే మొత్తం రాష్ట్రానికి బీపీ వస్తుందని నారా లోకేష్ పేర్కొన్నారు. అంతేకాకుండా జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబును రోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదు… ముఖ్యమంత్రిని జైల్లో పెట్టి తన్నాలి అంటూ పరుష పదజాలంతో మాట్లాడలేదా అని ప్రశ్నించారు. ఇక దాడులకు నిరసనగా ఈ రోజు చంద్రబాబు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిరాహార దీక్షకు దిగుతున్నారు టిడిపి నాయకులు కార్యకర్తలతో కలిసి చంద్రబాబు దీక్షకు సిద్ధం అవుతున్నారు.