తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ సమంత చాలా పై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. కేసులో నిన్న విచారణ త్వరగా తీర్పును కోర్టు ఈరోజు వాయిదా వేసింది. సమంత తరఫు న్యాయవాది బాలాజీ కోర్టులో వాదనలు వినిపించారు సుమన్ టీవీ పాపులర్ టీవీ సి ఎల్ డాక్టర్ వెంకటరావు చేసిన ప్రసారాలను నిలిపివేయాలని న్యాయవాది బాలాజీ కోర్టును కోరారు అంతేకాకుండా సమంతపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా కోర్టు మాత్రం సమంత కు షాక్ ఇచ్చింది.
సెలబ్రెటీల వ్యవహారాలను వాళ్లే బయట పెట్టుకుంటారు అంటూ సమాధానం ఇచ్చింది. అంతే కాకుండా ఆయా టివిల నుండి క్షమాపణలు కోరాలని కానీ పరువు నష్టం దావా ఎందుకు అంటూ ప్రశ్నించింది. కాగా ఈ కేసులో నేడు తీర్పు వెలువడనుంది. ఇదిలా ఉంటే సమంత విడాకుల వ్యవహారాల పై ఎన్నో రకాల వార్తలు నెట్టింట హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. సమంత కు మరో అఫైర్ అంటూ సంచలన కథనాలు ప్రసారం చేశారు. ఈనేపథ్యంలో లోనే సమంత కోర్టును ఆశ్రయించారు.