ఇండియా కరోనా కేసులు మళ్లీ తగ్గు ముఖం పట్టాయి. నిన్న 18 వేలు క్రాస్ చేసిన కరోనా కేసుల సంఖ్య ఇక ఇవాళ 15 వేలకు పడి పోయింది. దేశం లో ఇలాగే కరోనా కేసులు నిలకడగా నమోదు కాకుండా… ఓ రోజు పెరుగుతూ.. ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 15,786 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,75,745 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 97.96 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 231 మంది కరోనా తో మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 21, 963 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,24,263 కరోనా పరీక్షలు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. దీంతో దేశ వ్యాప్తంగా చేసిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 59,70,66,481 కు చేరుకుంది.