ధూళిపాళ్ల నరేంద్రకు మరో షాక్‌… దేవాదాయ శాఖ నోటీసులు

-

తెలుగు దేశం పార్టీ ధూలి పాళ్ల నరేంద్ర కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రపై ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం మరో అస్త్రం వదిలింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టును స్వాధీనం చేసుకు నేందుకు నోటీసులు జారీ చేసింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది సర్కార్‌.

ఈ మేరకు నోటీసులు జారీ చేశారు దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు దేవాదాయ శాఖ కమిషనర్. దీంతో ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టు ద్వారా నడుస్తున్న డివిసి ఆసుపత్రి పరిస్తితి ఆందోళన కరంగా మారింది. రెండు రోజుల్లో గా తమ నోటీసుల పై స్పందించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది ఏపీ దేవా దాయ శాఖ. కాగా.. ఇటీవలే.. సంగం డెయిరీ విషయంలో ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌ అయిన సంగతి తెల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news