అండమాన్ నికోబార్ లో భూకంపం.. ఇండియాలో వరసగా భూప్రకంపనలు

-

భారత దేశంతో వరస భూకంపాలు గుబులుపుట్టిస్తున్నాయి. రోజుల వ్యవధిలో ఏదో చోట భూకంపాలు సంభవిస్తున్నాయి. నిన్న హిమాచల్ ప్రదేశ్లో భూకంపం సంభవిస్తే తాజాగా బుధవారం ఉదయం అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్విట్ చేసింది. అండమాన్ లోని దిగ్లపూర్ కు సమీపంలో భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. దిగ్లిపూర్ కు 90 కిలోమీటర్ల ఆగ్నేయంగా భూ ఉపరితలం నుంచి 80 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీక్రుతం అయింది. ఇదిలా ఉంటే ఒక రోజు ముందు మంగళవారం హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.3 తీవ్రతతో భూమి కంపింపించి. మనాలీకి వాయువ్యంగా 108 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీక్రుతం అయింది. ఇదే విధంగా అక్టోబర్ 24న మహారాష్ట్ర కొల్హాపూర్ లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇలా వరసగా ఇటీవల ఇండియాలో ఎక్కడో ఓ చోట భూ ప్రకంపనలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news