బీజేపీ పార్టీ గూటికి వెళ్లనున్నారు మణికట్టు మాంత్రికుడు వీవీఎస్ లక్ష్మణ్. త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు వీవీఎస్ లక్ష్మణ్. అతి త్వర లో కాషాయ కండువా కప్పుకోనున్నారు హైద్రాబాదీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్. వీవీఎస్ లక్ష్మణ్ తో బీజేపీ జాతీయ నేతలు ఇప్పటికే చర్చలు జరిపారట. వచ్చే ఎన్నిక ల్లో తెలంగాణ రాష్ట్రం లో పాగా వేయాలనుకుంటోన్న బీజేపీ పార్టీ.. ఈ నేపథ్యం లోనే వీవీఎస్ లక్ష్మణ్ ను పార్టీ లోకి లాగాలని చూస్తోంది.
vvs లక్ష్మణ్ చేరికకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం సమాచారం అందుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధి లో ఒక నియోజక వర్గం నుంచి లక్ష్మణ్ ను బరి లోకి దించే యోచనలో కాషాయ పార్టీ ఆలోచన చేస్తోంది. కాగా ప్రస్తుతం ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మెంటర్, కామెంటేటర్ వ్యవహరిస్తోన్నారు వీవీఎస్. అలాగే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA) చీఫ్ గా ద్రవిడ్ స్థానంలో లక్ష్మణ్ ను పంపే యోచనలో ఉంది బీసీసీఐ. అటు ఎన్సీఏ చీఫ్ పదవిని లక్ష్మణ్ తిరస్కరిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వీవీఎస్ లక్ష్మణ్ దుబాయ్ లో ఉన్నారు.