హుజూరాబాద్ లో కేసీఆర్ సభ పెట్టకుండా బీజేపీ కుట్ర చేసిందని హరీష్ రావు దుయ్యబట్టారు. గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయం కావడంతో బీజేపీ కొత్త కుట్రలు పన్నుతుందని ఆయన విమర్శించారు. ఉప ఎన్నికల సర్వేలన్నీ టీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని, 2001 నుంచి ఈ ప్రాంత ప్రజలు కేసీఆర్ ను ఆదరిస్తూ వస్తున్నారని హరీష్ రావు అన్నారు. బీజేపీ నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడకుండా, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోల్ ధరల గురించి మాట్లాడం లేదు, కనీసం భవిష్యత్తులో ధరలు పెరగవనే హామీ కూడా ఇవ్వడం లేదని బీజేపీని ఎద్దేవా చేశారు. మాకున్న సమచారం ప్రకారం మరికొన్ని రోజుల్లో గ్యాస్ పై మరో రూ. 200 పెంచుతారన్నారు. గ్యాస్ కు ఇచ్చే రూ. 250 సబ్సిడీని కూడా బీజేపీ ప్రభుత్వం తొలగించిందన్నారు. దళితబంధు పథకం అందకుండా కుట్రలు చేసింది బీజేపీ పార్టీ కాదా..? అని ప్రశ్నించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఈసీకి లేఖ రాస్తేనే కదా హుజూరాబాద్ లో దళితబందును ఆపారని గుర్తు చేశారు. రైతుల గురించి మాట్లాడే అర్హత బీజేపీ పార్టీకి లేదని అన్నారు. రైతులు ధర్నా చేస్తుంటే యూపీలో వారిపైకి కారు ఎక్కించింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు చేసిన హుజూరాబాద్ లో గెలిచేది టీఆర్ఎసే అని ఆయన స్పష్టం చేశారు.
హుజూరాబాద్ లో కేసీఆర్ సభ పెట్టకుండా బీజేపీ కుట్ర చేసింది- హరీష్ రావు
-