కార్తీకదీపం ఎపిసోడ్ 1183: ఛీ వాడికేం దరిద్రం పట్టింది అంటూ కార్తీక్ ను తిడుతున్న ఆనంద్ రావు..ఇంట్లోంచి వెళ్లిపోయిన దీప

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో హిమ, శౌర్యలు ఆడుకుంటూ ఉంటారు. అది చూసి ఆనంద్ రావు, ఆదిత్యలు ఎంజాయి చేస్తూ ఉంటారు. ఆహా ఇన్నిరోజులకు మీ ముఖంలో చిరునవ్వు వచ్చింది, ఎప్పుడూ ఇలానే ఉండండి. కోంపకాస్త ప్రశాంతంగా ఉంటుంది అంటాడు. అలా వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా..సౌందర్య, కార్తీక్ వస్తారు. వాళ్లను చూసిన పిల్లలు కార్తీక్ ను కౌగిలించుకుంటారు. పాపం మనోడికి హ్యాపీనెస్ ఉండదు. ఆనంద్ రావు ఏంటి సౌందర్య ఎక్కడికి వెళ్లారు అంటే.. పెద్దోడు నేను కలిసి గుడికి వెళ్లొస్తున్నాం అండి అంటుంది సౌందర్య. సడన్ గా గుడికి ఏంటి మమ్మీ అంటాడు ఆదిత్య..ఇంతలో దీప వచ్చి గుడికి వెళ్లటానికి భక్తి ఉంటే చాలుకదా ఆదిత్య..సమయం సందర్భాలు అవసరమా చెప్పు అంటుంది. కదా అత్తయ్య అంటుంది. సౌందర్య హూ అంటుంది. ఎందుకు వెళ్లారని అడక్కండి మావయ్యగారు, ఏదో మొక్కు చెల్లించుకునేది ఉండిపోయిందంట, అందుకే వెళ్లారంట కద డాక్టర్ బాబు అంటే అవును అంటాడు కార్తీక్. పిల్లలకు ప్రసాదం తీసోకోండి అంటుంది. ఆదిత్యకు కూడా చెప్తుంది. దర్శనం బాగా జరిగిందా అత్తయ్య, బాగానే జరిగి ఉంటుందిలే అంటుంది దీప. ఆ మాటకు వాళ్లు ఏం మాట్లాడకుండా పైకి వెళ్తారు. దీప పిలిచి అత్తయ్య నేనేం పాపం చేశాను అత్తయ్య అని గాప్ ఇస్తుంది. వీళ్లుటెన్షన్ పడతారు. దీప మళ్లీ నేనేం పాపం చేశాను అని నన్ను వదిలేసి గుడికివెళ్లారు అత్తయ్య, ఈ సారి గుడికి వెళ్లినప్పుడు నన్ను పిలవండి అత్తయ్య అంటుంది. ఆనంద్ రావు ఆమాత్రం దానికి అంతలా బతిమిలాడాలా దీప, ఇంకోసారి వెళ్లినప్పుడు తీసుకెళ్లు సౌందర్య అంటాడు. దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. ప్రియమణి గమనిస్తుంది.

karthika-deepamఇంకోసీన్ లో మోనిత తన బిడ్డను చూసుకుంటూ ఉంటుంది. భారతి వచ్చి ఏంటి మోనిత ఇంత మొండితనమా చావు అంచుల వరకూ వెళ్లావ్ తెలుసా అంటే..అలా జరగలేదు కదా భారతి అంటుంది మోనిత. అయినా ఇంత పెద్ద నిజం ఎందుకు దాచిపెట్టావ్ అని భారతి అంటే..చెప్తే నా కారెక్టర్ గురించి ఎలా మాట్లాడేవాళ్లో తెలుసుకదా భారతి అంటాడు. ఇప్పుడు మాత్రం కార్తీక్ నిన్న భార్యగా అంగీకరిస్తాడా అని భారతి అడుగుతుంది. నా భర్తగా సైన్ చేసాడుకదా అంటుంది మోనిత. నువ్వు చచ్చిపోతావ్ అన్న మానవత్వంతో సైన్ చేసి ఉండొచ్చుకదా , దీపను నమ్మడానికే పదకొండేళ్లు పట్టింది అంటుంది భారతి. నేను అంత దూరం ఆలోచించలేదు..కార్తీక్ సైన్ చేశాడు చాలు, ఇప్పుడు వీడికి బారసాల చేయాలి..దానిగురించే ఆలోచిస్తున్నాను అంటుంది మోనిత.

ఇంట్లో కార్తీక్ దీప గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దీపకు నిజం చెప్పి బాధపెట్టలేను, అబద్ధం చెప్పి ఎంతోకాలం మోసం చేయలేను అంటాడు. ఇంతలో ఈ పిల్లలు ఇద్దరు వచ్చి ఇక్కడేం చేస్తున్నావ్ అంటారు. ఏం లేదురా ఊరికే అలా అంటాడు. హిమ కార్తీక్ చేతులుపట్టుకుని సారీ డాడీ, ఇంకెప్పుడు బాధపెట్టను, నువ్వు మంచోడివి డాడీ అంటుంది. కానీ కార్తీక్ కు మాత్రం నువ్వు మంచోడివి కాదు డాడీ, ఎప్పుడు అబద్దాలే చెప్తావ్ అన్నట్లు అనిపిస్తుంది. పిల్లలు ఆడుకుందాం డాడీ అన్నా కార్తీక్ వద్దంటాడు.

ఆనంద్ రావు రూంలో కార్తీక్ అమెరికా ప్రయాణం ఎందుకు క్యాన్సిల్ చేశాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. సౌందర్య వస్తుంది. ఏంటండి మీరింకా నిద్రపోలేదు అంటుంది. నిద్రపట్టటం లేదు, నువ్వేంటి పొద్దిటి నుంచి నువ్వు నాతో సరిగ్గా మాట్లాడటంలేదు అంటాడు. నేను పిల్లల దగ్గర పడుకుంటాను అని వెళ్లిపోబోతుంది.. ఏంటి సౌందర్య మాట్లాడుతుంటే వెళ్లిపోతున్నావ్, ఎందకు అలా ఉన్నావ్, వాడు అమెరికా ట్రిప్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు, ఎన్నడూ లేంది మీరు ఇద్దరూ కలిసి గుడికి ఎందుకు వెళ్లారు..చెప్పటం అవసరం లేదనుకుంటే వెళ్లు అంటాడు. సౌందర్య వచ్చి ఆనంద్ రావు చేతులు పట్టుకుని తప్పు జరిగిపోయింది అండి, పెద్ద తప్పు జరిగింది, మన ప్రమేయం లేకుండానే పెద్ద అన్యాయం జరిగింది, ఈ విషయం వింటే మీరు తట్టుకోలేరని చెప్పలేదు అని జరిగింది మొత్తం చెప్తుంది.

ఇదంతా విన్న ఆనంద్ రావుకి గుండెదడ వస్తుంది. సౌందర్య వాటర్ తాగిస్తుంది. కోడలకి ఏం సమాధానం చెప్తావ్ సౌందర్య, ఇప్పటిదాక చేసిన అన్యాయం చాలదా సౌందర్య, దీపకు ఈ విషయం తెలిస్తే మనం తన కళ్లల్లోకి చూడగలమా, పిల్లలకు ఏం చెప్తామ్, సమాజానికి ఏం చెప్తామ్..అసలు వాడేం మనిషి సౌందర్య, ఆ దరిద్రుడికి ఏం పట్టిందని ఇలా చేశాడు, ఇవన్నీ చూడ్డానికేనా నేను బతికుంది..అప్పుడేపోయినా బాగుండేంది అంటాడు.

ఇంకోవైపు దీప ప్రియమణి అన్న మాటలను తలుకుకుని బాధపడుతూ ఉంటుంది. ల్యాబ్ లో ఆ స్టాఫ్ చెప్పింది గుర్తుచేసుకుని, నన్ను ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారు, అబద్ధాలు చెబుతున్నారు, హాస్పటల్ కి వెళ్లొచ్చిన విషయం కూడా నా దగ్గర దాచారు అనుకుంటూ బాధపడుతుంది. కార్తీక్ వచ్చి ఏంటి దీప ఒక్కదానివే ఇక్కడ ఉన్నావ్ అంటాడు. ఎక్కడున్న ఒంటరిదాన్నే కదా డాక్టర్ బాబు, అమెరికా ఎందుకు వద్దనుకున్నారు, ఆ మోనిత అంటూ ఏదో చెప్పబోతుంది. కార్తీక్ కి కోపం వస్తుంది..మోనిత మోనిత ఇంట్లో ఆ మోనిత గురించి తప్ప మాట్లాడుకోవటానికి ఇంకేం లేవా, అందరూ అదే టాపికా, మనిద్దరం మధ్య మాట్లాడుకోవటానికి ఇంకేలేవా అంటాడు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయిభాగంలో సౌందర్య, కార్తీక్ దీప గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో పిల్లలు వచ్చి నాన్న అమ్మకనిపించటం లేదు, ఫోన్ ఇక్కడే పెట్టి వెళ్లిపోయింది అంటారు. దీప ఒక్కతే ఏటో ఒక్కతే నడుచుకుంటూ వెళ్తుంది.

                                                                                                                          -Triveni

Read more RELATED
Recommended to you

Latest news