పునీత్ రాజ్‌ కుమార్‌ అంత్యక్రియలు :కుటుంబ సభ్యుల సంచలన నిర్ణయం

-

పునీత్‌ రాజ్‌ కుమార్‌ అంత్య క్రియల విషయం లో అతని కుటుంబ సభ్యులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ కు అంత్యక్రియల ప్ర క్రియను పునీత్ అన్న రాఘవేంద్ర కొడుకు వినయ్ రాజ్ కుమార్ తో చేయించాలని రాజ్ కుమార్ కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకున్నారు.. ఇవ్వాళ పునీత్ రాజ్ కుమార్ కుమార్తె అమెరికా నుండి రాగానే అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సమాచారం అందుతోంది.

పునీత్ రాజ్ కుమార్ కి ఇద్దరు కుమార్తె లు కావడం తో వినయ్ రాజ్ కుమార్ తో చేయిస్తుంది పునీత్ రాజ్‌ కుమార్‌ కుటుంబం. కంఠీరవ స్టూడియో లో తల్లిదండ్రుల సమాధుల మధ్య లో పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరుగనున్నాయి. కాగా.. నిన్న మధ్యాహ్నం గుండె పోటు తో పునీత్‌ రాజ్‌ కుమార్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. బెంగళూరు లోని విక్రమ్‌ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ… పునీత్‌ రాజ్‌ కుమార్‌ మృతి చెందారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాదంలోకి నెట్టి వేయబడింది.

Read more RELATED
Recommended to you

Latest news