Puneeth Rajkumar: కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కుటుంబంలో అంతులేని విషాదం మిగిలింది. శాండిల్ వుడే కాదు.. యవాత్తు సినీ జగత్తు కన్నీరు పెడుతుంది. పవర్‌స్టార్ పునీత్‌కుమార్ హఠాన్మరణంతో ఆ రాష్ట్రవ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు ఆశ్రునయనాలతో అభిమానులు భారీగా తరలివస్తున్నారు.
అయితే.. కన్నడ చిత్ర సీమ లెజెండరీ నటుడు రాజ్ కుమార్ కుటుంబాన్ని గుండె పోటు సమస్య వెంటాడుతుందా? అంటే నిజమే అనే సమాధానాలు వెల్లడుతున్నాయి. కన్నడ చిత్ర పరిశ్రమలో లెజెండరీ నటుల్లో ఆయన ఒకరు. కన్నడ కంఠీరవ, సూపర్ స్టార్ రాజ్ కుమార్. తన నటనతో విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ని, ఇమేజ్‌ని సొంతం చేసుకుని నట సార్వభౌమగా పేరుతెచ్చుకున్న రాజ్‌కుమార్. ఆయన కూడా ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకునే వాడు.
ప్రతిరోజూ ఉదయాన్నే వాకింగ్, వ్యాయమం చేసేవారు. 2006 ఏప్రిల్ 12 నాడు ఎప్పటిలానే వాకింగ్ చేసి ఇంటికి తిరిగి వచ్చారు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆయన మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఉన్నట్టుండి సోఫాలో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించాడు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2.30 గంటలకు రాజ్‌కుమార్(77) కన్నుమూశారని వైద్యులు ప్రకటించారు.
ఆ తర్వాత 2015లో.. రాజ్ కుమార్ పెద్ద కుమారుడు శివరాజ్ కుమార్ కు హర్ట్ ఎటాక్ వచ్చింది.
ఆయనకు స్వల్పంగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. వెంటనే చికిత్స అందించడంతో ఎలాంటి ప్రాణపాయం లేకుండా సురక్షింగా బయటపడ్డారు. అయితే చాలా ఆరోగ్యంగా ఉండే ఆయనకు గుండెపోటు రావడమేమిటని అందరూ ఆశ్చర్యం పోయారు. ప్రాణాపాయం లేకపోవడంతో తన అభిమానులు ఊపిరి పిల్చుకున్నారు.
లెజండరీ నటుడు రాజ్ కుమారు చనిపోయిన సుమారు 15 సంవత్సరాల తర్వాత పునీత్ గుండెపోటుతో మరణించడం అభిమానుల్ని ఎంతగానో కలచివేస్తోంది. ఫిట్‌నెస్ విషయంలో పునీత్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో అందరికీ తెలుసు. ఆయన దినచర్యలో జిమ్‌లో వర్కౌట్లు.. సైక్లింగ్.. వాకింగ్.. రన్నింగ్.. ఎదో ఒక వర్క్ అవుట్ తప్పని సరి.. వర్క్ అవుట్ చేయని రోజు ఏదోలా ఉంటుందని పలు ఇంటర్య్వూల్లో తెలిపారు.
ఇప్పటిలాగానే.. శుక్రవారం ఉదయం జిమ్‌లోకి వెళ్లారు. సూమారు తొమ్మిది గంటల సమయంలో
వర్క్ అవుట్స్ చేస్తూ ఉన్నపలంగా కుప్పకూలారు. గుండెలో నొప్పిగా ఉందనడంతో.. వెంటనే దగ్గర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. ఆయన ప్రాణాలు కాపాడటానికి.. అక్కడి వైద్యసిబ్బంది ఎంతోగానో శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. మధ్యాహ్నం 2.30 గంటల పాంత్రంలో పునీత్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఇదిలా ఉంటే పునీత్ రాజ్‌కుమార్‌కి హార్ట్ ఎటాక్ రావడానికి కారణాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అతి వర్కౌటే చేయడమే ఆయన చేసిన తప్పిదమని అంటున్నారు. ఆయన నెక్ట్స్ సినిమా `జేమ్స్` చిత్రంలో బాడీ బిల్డర్‌గా కనిపించబోతున్నారట. అందుకోసం ఫిట్‌గా, కండలు తిరిగిన దేహంతో కనిపించేందుకు .. ఈ మధ్యకాలంలో అతిగా వర్కౌట్ చేయడం వల్లే హార్ట్ ఎటాక్ వచ్చిందని భావిస్తున్నారు వైద్యులు. సరైన డైట్ తీసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు.