హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక పోలింగ్ రసవత్తరంగా కొనసాగుతోంది. చెదురు మదురు ఘటనల మధ్య హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యం లోనే జమ్మికుంట మండలంలో హై డ్రామా నెలకొంది. అధికార పార్టీ టీఆర్ఎస్ కౌన్సిలర్ కిషన్ రెడ్డి ఇంటి ముందు బీజేపీ పార్టీ కార్యకర్తలు ఆందోళన కు దిగారు. కిషన్ రెడ్డి ఇంటిని తనిఖీ చేయాలని బీజేపీ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇంటిని సీపీ సోదా చేయడం తో అక్కడి వివాదం సద్దు మణిగింది.
అటు హిమ్మత్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యం లోనే బీజేపీ నేత తుల ఉమ ను టీఆర్ఎస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. బయటి వ్యక్తులు హుజురాబాద్ లోకి వచ్చారని టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో బీజేపీ మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. జమ్మికుంట గాంధీ చౌరస్తాలోనూ బీజేపీ మరియు టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. రెండు వర్గాలను చెదరగొట్టారు.