సూపర్ స్టార్ రజనీకాంత్… హెల్త్ బులిటెన్ ను తాజాగా విడుదల అయింది. తమిళ సూపర్ స్టార్, తలైవా రజనీ కాంత్ వేగంగానే.. కోలు కుంటున్నారని తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు వైద్యులు. మరో రెండు లేదా మూడు రోజుల్లోనే… రజనీ కాంత్ డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని కావేరీ ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు.
మూడు రోజుల క్రితం తల నొప్పి, జ్వరం, భుజం నొప్పి తో రజనీ కాంత్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే… రజనీ కాంత్ ని చెన్నై లోని కావేరి ఆస్పత్రి లో చేర్పించారు. ఇక రజనీ మెదడు లోని రక్త నాళాల్లో ఉన్న బ్లాక్స్ ను వైద్యులు తొలగించారు. కాగా… సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య ంపై తమిళ నాడు ముఖ్య మంత్రి స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఇవాళ సాయంత్రం రజినీకాంత్ ను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లనున్నారు సీఎం స్టాలిన్.