Bigg Boss 5 Telugu: “భ‌యప‌డి .. పోసుకుని వచ్చా”.. స‌న్నీకి ష‌న్ను షాకింగ్ రిప్లే..

-

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఇప్పటికే ఏడు వారాలు, ఏడు ఎలిమినేష‌న్ల‌ను స‌క్సెస్ పుల్ గా పూర్తి చేసుకుని ఎనిమిదో వారంలో హై రేటింగ్ తో దూసుక‌పోతుంది బిగ్ బాస్. ఇప్ప‌టికే సగం సీజ‌న్ పూర్తి కావ‌డంతో టాప్ 5 కంటెస్టెంట్ల మీద ఓ క్లారిటీ వ‌చ్చింది. అందులో ఒక‌రు ష‌ణ్మఖ్ జ‌స్వంత్ .. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉండడంతో టైటిల్ ఫేవరెట్‌గా నిలిచారు.

తొలి వారాల్లో అత‌ని గేమ్ ఫ్లాన్ మీద నెటిజ‌న్ల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. కానీ, గ‌త రెండు వారాలుగా త‌న గేమ్ ఫ్లాన్ ను మర్చాడు. చక్కగా ఆడుతూ షోకు హైలైట్ గా నిలిచారు. ఈ వారం త‌న‌ స్ట్రాటజీలు అమ‌లు చేసుకుంటు కెప్టెన్ గా గెలిచి సత్తాను చూపిస్తున్నాడు. కెప్టెన్‌గా సక్సెస్ అవడం కోసం అందరూ సహకరించాలని పేరు పేరునా కోరుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో షణ్ముఖ్ జస్వంత్ వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం!

ఈ వారం కంటెస్టెంట్లకు బిగ్ బాస్ పూరీల టాస్క్ ఇచ్చాడు. టాస్కులో భాగంగా ఇంటి స‌భ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు. వేగంగా పూరీలు చేసిన వాళ్లే విజేతలుగా నిలుస్తార‌ని చెప్పాడు. ఈ టాస్కుకు సంచాలకుడిగా హౌస్ కెప్టెన్ షణ్ముఖ్ జస్వంత్ ఉన్నాడు. కాజల్ టీం సభ్యులు తొందరగా కంప్లీట్ చేశారు. అయితే పర్ఫెక్ట్ మేకింగ్ అంటూ ఆనీ మాస్టర్ టీంని విజేతగా ప్రకటించాడు షణ్ముఖ్.

ఇక అక్క‌డ అస‌లు గొడ‌వ స్టార్ అయ్యింది. జైలు లో ఉన్న స‌న్నీ ష‌న్ను జ‌డ్జిమెంట్ ను త‌ప్పుత‌ట్టారు. రూల్ బుక్ ప్ర‌కారం.. ఫాస్ట్‌గా చేసిన వాళ్లే విజేత అని చెప్పారు కదా.. సరిగ్గా చదువుకోవచ్చు కదా అని షణ్ముఖ్‌కి చెప్పాడు. స‌న్నీ మాటల‌కు ఆన్నీ మాస్ట‌ర్ ఓ రేంజ్లో రియాక్ట్ అయ్యింది. దీంతో స‌న్నీ, ఆనీ ల మ‌ధ్య గొడవ ముదిరింది. ఆ మాట‌లు ప్రాంతీయ వాదం వైపు సాగాయి. ఈ గేమ్ కి సంచాల‌కుడిగా ఉన్న ష‌న్ను మాత్రం విడదీయాల్సింది పోయి నవ్వుతూ కూర్చున్నాడు.

దీంతో సన్నీకి అది చూసిన సన్నీకి కాలింది. ఇదే విషయంపై అతడితో గొడవ పడ్డాడు.
హౌస్‌లో గొడవ అవుతుంటే.. నీకు నవ్వు వ‌స్తుందా.. అది కరెక్ట్ కాదని అని నిల‌దీశాడు స‌న్నీ. నాకు న‌వ్వువ‌స్తే.. న‌వ్వినా ఇందులో త‌ప్పేముంది అన్నాడు షణ్ముఖ్. గేమ్ అంటే మజాక్ గా ఉందా అని ష‌న్నును ప్రశ్నించ‌గా.. అవును నాకు బాగా కిక్ వస్తుంది అని షణ్ముఖ్ మరింత రెచ్చగొట్టేశాడు. నేను బయటకు వస్తే ఇంకా కిక్ ఉంటుందని సన్నీ అన్నాడు.

అప్పుడు షన్నూ ‘వామ్మో భయం వేస్తుంది.. ఇప్పుడే పోసుకుని వచ్చా.. నీ భయానికి మళ్లీ పోసుకుని వస్తా.. దమ్ముంటే కొట్టు.. అని పంచ్ వేశాడు షణ్ముఖ్. దీంతో స‌న్నీ..నువ్ భయపడ్డావ్ కాబట్టే నన్ను లోపల పెట్టావ్.. అని అన్నాడు. నీకు నేను భయపడటం లేదు.. నువ్ ఫిజికల్ అయ్యావని నేను అనలేదు.. హౌస్‌లో వాళ్లు అని స‌ర్థి చేప్పే ప్ర‌య‌త్నం చేసాడు ష‌న్ను.. ఇప్పుడూ ఈ డైలాగులో సోష‌ల్ మీడియాలు ట్రెండిగా మారాయి.. మ‌రికొంద‌రూ మీమ్స్ గా యూజ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news