సూపర్ స్టార్ రజినీకాంత్ ఈనెల 28న స్వల్ప అనారోగ్యంతో కావేరీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా రజినీ పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఆయనకు పరీక్షలు నిర్వహించగా ధమనుల్లో సమస్య ఉన్నట్టు గుర్తించారు. దాంతో మొదడు రక్తం ప్రసారం అయ్యే నాళాల్లో బ్లాక ను గుర్తించి దానిని ప్రొసీజర్ ద్వారా తొలగించారు. ఇక ఒకరోజు అబ్జర్ వేషన్లో ఉంచి నిన్న రాత్రి రజినీని ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.
ఈ విషయాన్ని రజినీకాంత్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దేవుడికి ఇంట్లో దండం పెడుతున్న ఫోటోను రజినీకాంత్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇదిలా ఉండగా రజినీకాంత్ అన్నాత్తై షూటింగ్ లో ఉన్న సమయంలో అస్వస్తతకు గురైన సంగతి తెలిసిందే. బీపీలో హెచ్చుతగ్గుల కారణంగా రజినీ ఆస్పత్రిలో చేరారు. అయితే రజినీ కాంత్ అన్ని పరీక్షలు నిర్వహించిన తరవాత వైద్యులు దమనుల్లో సమస్యను గుర్తించి చికిత్స చేశారు.