దేశవ్యాప్తంగా తగ్గిన కరోనా కేసులు…24 గంటల్లో 12,514 కేసులు నమోదు

-

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా కరోనా వ్యాప్తి తగ్గడంతో క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రపంచ దేశాలు కరోనా కల్లోలంతో బాధపడుతుంటే… భారత్ లో మాత్రం కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం శుభపరిణామం. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కేవలం 12,514  కొత్త కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. భారతదేశంలో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 3,42,85,814 కు పెరిగింది, అయితే యాక్టివ్ కేసుల సంఖ్య 1,58,817 కు తగ్గాయి. గత 248 రోజులతో పోలిస్తే ఇదే అత్యల్ప సంఖ్య అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా 251 మరణాలతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 4,58,437 కు చేరుకుంది.

గత 24 రోజుల నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 వేల కన్నా తక్కువగా నమోదయ్యాయి. వరసగా 127 రోజుల నుంచి ఇండియాలో కేసుల సంఖ్య50 వేల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 98.2 శాతం నమోదైంది. భారత దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా జరుగుతుండటంతో కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతుంది. 

Read more RELATED
Recommended to you

Latest news