కార్తీకదీపం ఎపిసోడ్ 1186: దీప చేతిలో మరోసాక్ష్యం..కార్తీక్ మెడచుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య ఓ పూజారి ఇంటికి వస్తుంది. భగవంతుడా మాకు ఏంటి ఈ పరీక్షలు, చేసిన పాపంలో ఈ శాపం ఏంటి, దీపకు ఈ విషయం తెలిస్తే అది ఏమవుతుందో ఏమో అనుకుని పూజారి ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్తూ..దీప ఎక్కడికి వెళ్లిందో అన్నటెన్షన్ ఒకవైపు..ఇంకోపక్క మోనితకు పుట్టిన బిడ్డ పేగుమెడకు వేసుకుని పుట్టాడన్న టెన్షన్ మరోవైపు..అసులు నేను చేస్తున్నది తప్పారైటా అని ఆలోచిస్తూ ఉంటుంది. అసులు దీప కనిపించకంపోతే..వెళ్లి వెతకటం మానేసి పూజలేంటి..దీపను అంత లైట్ తీసుకున్నారా వీళ్లు అని ప్రేక్షకులకు కోపం వస్తుంది. పంతులుగారి దగ్గరకు వెళ్తుంది. మ్యాటర్ మొత్తం సౌందర్య ఆ పంతులికి చెప్తుంది. ఫైనల్ గా పంతులుగారు..బిడ్డ పేగు మెడకు వేసుకుని పుడితే శాంతి చేయించాలమ్మా అంటాడు. ప్రాణగండం ఎంతవరకూ నిజం అంటుంది. పంతులు ఎవరి నమ్మకం వారిది, మీరు నమ్మకుంటే అది మీ వ్యక్తిగతం అంటాడు. మీకు నమ్మకంగా ఉంటేనే శాంతిపూజ, దోషనివారణ చేయిద్దాం, పూజకు కావాల్సిన సామాగ్రి లిస్ట్ రాయిస్తాను..చేయించాలి అనుకుంటే పొద్దునే గుడికి రండి అని లిస్ట్ రాస్తూ తండ్రిపేరేంటి అంటాడు. కార్తీక్ అంటుంది సౌందర్య. పంతులుగారు లీస్ట్ రాసి ఇస్తారు. ఎ‌వరు ఎవరు రావాలి అంటుంది సౌందర్య. మేనమావ, తండ్రి, తల్లి అంటాడు. మేనమావ లేరు అంటుంది. అయితే తండ్రికే ఎక్కువ గండం అంటుంది. తల్లి కూడా ఉండాలి అంటాడు. కచ్చితంగా తల్లితండ్రి ఉండాలి అని చెప్తాడు. సౌందర్య వెళ్లిపోతుంది. ఏదో పూజ అంటే చేయిద్దాం అనుకున్నా కానీ..ఇప్పుడు ఈ మోనితను ఎలా తీసుకురావటం అనుకుంటుంది.

karthika-deepamఇంకోవైపు దీప రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. ల్యాబ్ లో చెప్పింది తలుచుకుని..ఎవరు చెప్పేది అబద్ధం, అసలు ఏం జరిగి ఉంటుంది అని తలుచుకుంటూ ఉంటుంది. మరోపక్క సౌందర్య డ్రైవ్ చేస్తూ పూజారి చెప్పిన మాటలను గుర్తుచేసుకుని..ఇప్పుడు మోనిత దగ్గరకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలి అనుకుంటూ ఉంటుంది. అసలు దీప ఎక్కడికి వెళ్లింది, సెల్ ఫోన్ కూడా తీసుకెళ్లలేదంటే అసలు అది ఎక్కడికి వెళ్లి ఉంటుంది అనుకుంటుంది. ఇంతలోనే దీపే ఎదురువస్తుంది. సౌందర్య కారు దిగి ఎక్కడికి వెళ్లావ్ దీప, ఇంట్లో అందరం ఎంత కంగారు పడుతునుమ్మో తెలుసా అంటుంది. కంగారు ఎందుకు అత్తయ్య అంటుంది. అంటే సెల్ ఫోన్ కూడా తీసుకెళ్లలేదు కదా అంటుంది సౌందర్య. సెల్ ఫోనే కదా అత్తయ్య వదిలేసింది అంటుంది. సౌందర్య మనసులో దీప ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఏమైనా తెలిసి ఉంటుందా, లేదా నాకే అలా అనిపిస్తుందా అనుకుని రాత్రి కూడా సరిగ్గా నిద్రపోలేదంటకదా అంటుంది. అసలు రోడ్డుమీద ఈ పంచాయతీ ఏంటో. దీప కూడా నిద్రదేముంది అత్తయ్య అంటూ వైరాగ్యం పట్టినట్లు గతంలోమాత్రం ఎప్పుడు ప్రశాంతంగా పడుకున్నాను, అదే అలవాటు ఇక్కడ కూడా అంటుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్లావో చెప్పలేదు అని సౌందర్య అడిగితే.. చెప్పేంత గొప్ప ప్రదేశం కాదులే అంటుంది దీప. మీరు ఎక్కడికి వెళ్లారు అంటే..అబ్బే ఏం లేదు ఊరికే అలా అంటుంది సౌందర్య. దీప మనసులో అత్తయ్యకు అన్ని తెలిసే నా దగ్గర నిజం దాస్తున్నారా అనుకుంటుంది. అలా వాళ్లిద్దరు మాట్లాడుకుని కారు ఎక్కుతారు.

హాస్పటల్ మోనిత కార్తీక్ కు ఫోన్ చేస్తూ ఉంటుంది. కార్తీక్ కట్ చేస్తాడు. మోనితకు తిక్కరేగుతుంది..అప్పుడే భారతి వస్తుంది. ఏంటి భారతి ఇది కార్తీక్ ఫోన్ చేస్తుంటే లిఫ్ చేయడు..ఈ మగాళ్లకు తమ వెనుకపడే అమ్మాయిలంటే చులకన కదా. అరే అసలు ఎలా ఉన్నానో, తిన్నానో లేదో కనుక్కోడా అంటుంది. భారతి ఏంటి మీ ఇంటిని రెంట్ కి ఇస్తున్నావ్ అంట..నువ్వు ఎక్కడ ఉంటావ్ అంటుంది. మోనిత భయపడకు మీ ఇంటికి రానులే అంటుంది. మీ ఇంటిని రెంట్ కి ఇచ్చి, మా ఇంటికి రాక మరి ఎక్కడ ఉంటావ్ అంటుంది భారతి. ఎక్కడ ఉంటానో, ఏం చేస్తానో, సమయం సందర్భం వచ్చినప్పుడు నీకే ముందు చెప్తానులే అంటుంది. మళ్లీ కార్తీక్ కి కాల్ చేస్తాను అని ఫోన్ తీస్తుంది. కట్ చేస్తుంటే ఎందుకు చేయటం అంటే..ఈ రకంగా అయినా నన్ను తలుచుకుంటాడు కదా భారతి అని ఫోన్ చేస్తుంది. కార్తీక్ తియ్యడు.

కారులో సౌందర్య, దీప వస్తూ ఉండగానే..కార్తీక్ సౌందర్యకు ఫోన్ చేస్తాడు. ఫోన్ లాకర్లోనే పంతులు రాసిన పేపర్ ఉంటుంది. సౌందర్య భయపడుతుంది. వద్దులే అంటుంది. అయినా మళ్లీ మళ్లీ ఫోన్ రావటంతో దీప తీస్తుంది. ఫోన్ సౌందర్యకు ఇస్తుంది. సౌందర్య నేను మళ్లీ మాట్లడతా అంటుంది కార్తీక్ తో..దీప పక్కన నేనున్నాను అని ఇబ్బందిపడుతున్నారేమో..నన్ను కారు దిగమంటారా అత్తయ్య అంటుంది. సౌందర్యే కారు దిగి కార్తీక్ తో మాట్లాడుతుంది. దీప కారులో ఉండి నాకు తెలియకుండా ఏం జరుగుతుంది అనుకుంటుంది..అలా ఆ పంతులు రాసిచ్చిన పేపర్ చూస్తుంది. దోషనివారణ పూజ ఏంటి, కార్తీక్ పేరు ఉంది ఏంటి, నాకు తెలియకుండా వీళ్లు ఏం చేస్తున్నారు, అసలు ఈ పూజలేంటి అనుకుని ఆ పేపర్ మళ్లీ అక్కడే పెడతుంది. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news