హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితంపై టీఆర్ఎస్ నేత కౌషిక్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి రూ.25కోట్లకు అమ్ముడు పోయాడంటూ కౌషిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ బీజేపీలు కలిసి పోటీచేయడం దేశంలో ఎక్కడా లేదని కానీ హుజురాబాద్ లో జరిగిందని కౌషిక్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ టికెట్ ను రేవంత్ బీజేపీకి రూ.25 కోట్లతో అమ్ముకున్నారంటూ ఆరోపణలు చేశారు. అంతే కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ఛీఫ్ గా ఉన్న సమయంలో తను హుజురాబాద్ నుండి పోటీ చేస్తే 60వేల ఓట్లు వచ్చాయంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కానీ కాంగ్రెస్ నుండి పోటీకి దిగిన బల్మూరి వెంకట్ కు డిపాజిట్ కూడా దక్కలేందటూ వ్యాక్యానించారు. కాంగ్రెస్ ప్రధాన పార్టీగా బరిలోకి దిగిందని కానీ బల్మూరి వెంకట్ ఎక్స్ట్రా ప్లేయర్ గా మిగిలిపోయారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నుండి బల్మూరి వెంకట్ కు ఎలాంటి సహకారం అందలేదని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఆయన కోసం ప్రచారానికి ఎవరూ రాలేదని చివరికి బల్మూరి వెంకట్ ఎక్స్ట్రా ప్లేయర్ గా మిగిలిపోయారని కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.