హుజురాబాద్ ఉప ఎన్నిక లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించడం తో ఆయన పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి బీజేపీ సీనియర్ నాయకులు అమిత్ షా కూడా స్పందించాడు. ట్విట్టర్ లో తన అకౌంట్ ద్వారా తెలుగు లో ట్వీట్ పెట్టారు. బీజేపీ కి విజయాన్ని అందించిన హుజురాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే బీజేపీ పై తెలంగాణ ప్రజలు నమ్మకం ఉందని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ప్రకటించారు. అయితే అమిత్ షా తెలుగు భాషా లో ట్వీట్ చేయడం పట్ల రాష్ట్ర బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఢిల్లి పెద్దలు ప్రచారానికి రాకున్న ఈటల రాజేందర్ ఘన విజయం సాధించాడు. దీంతో ఈటల రాజేందర్ పై బీజేపీ అధిష్టానం ఆసక్తి ఉందని సమాచారం.
https://twitter.com/AmitShah/status/1455552256552497157?s=20