ఆప్ఘన్ తో టెస్ట్ మ్యాచ్ వాయిదా వేసిన ఆస్ట్రేలియా..

-

ఆప్ఘనిస్తాన్ తో ఆస్ట్రేలియా ఆడే టెస్ట్ మ్యాచ్ అనిశ్చితిలో పడింది. తాజాగా ఆప్ఘన్ లో జరుగుతున్న పరిణామాల కారణంగానే టెస్ట్ సిరీస్ వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. ఆప్ఘనిస్థాన్ లో పరిస్థితులు చక్కబడే వరకు టెస్ట్ మ్యాచ్ ను వాయిదా వేస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా నవంబర్ 5న ధ్రువీకరించింది. ఈనెల 27న హాంబర్ట్ వేదికగా రెండు దేశాల మధ్య టెస్ట్ జరగాల్సి ఉంది. అయితే ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారం చేజిక్కిచ్చుకున్న తరువాత అక్కడ విపరీత పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మహిళలు క్రీడలు ఆడేందుకు తాలిబన్లు ఒప్పుకోవడం లేదు. దీంతో తాలిబాన్ ప్రభుత్వం మహిళలు మరియు బాలికలను క్రీడలు ఆడేందుకు అనుమతించకపోతే టెస్ట్ మ్యాచ్ ను రద్దు చేస్తామని సెప్టెంబర్‌లో క్రికెట్ ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్ కు జలక్ ఇచ్చింది. 

ఇటీవల కాలంలో ఆప్ఘనిస్తాన్ జట్లు క్రికెట్ లో రాణిస్తోంది. తక్కువ వ్యవధిలో అగ్రశ్రేణి జట్లను ఎదుర్కొనేలా తయారైంది. అయితే తాలిబన్ల అధికారం చేపట్టిన తరువాత ఆదేశ పరిస్థితులు తలకిందులయ్యాయి. ప్రపంచంలో ఆప్ఘనిస్తాన్ ఒంటరిగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news