తెలంగాణలో కొత్త మద్యం పాలసీకి రంగం సిద్దమైంది. డిసెంబర్ 1 నుంచి తెలంగాణలో కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ కమీషనర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కొత్త మద్యం పాలసీ డిసెంబర్ 1, 2021 నుంచి నవంబర్ 30, 2023 వరకు ఉండనుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2216 మద్యం షాపులు ఉండగా కొత్తగా 300 వరకు మద్యం షాపులు రానున్నాయి. వీటిల్లో రిజర్వేషన్లు కూడా అమలు చేయనున్నట్లు సమాచారం. గతంలో మద్యం షాపుల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గౌడ్స్ కు 15 శాతం, ఎస్టీలకు 10, ఎస్సీలకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 10 నుంచి 18 వరకు మద్యం షాపులకు దరఖాస్తులు తీసుకుంటారని.. 20 తేదీన డ్రా ఉంటుందని విశ్వసనీయ సమాచారం. అయితే అప్లికేషన్ ఫీజు విషయంలో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. గతంలో రూ. 2 లక్షలు అప్లికేషన్ ఫీజు ఉంది. అయితే ఈసారి అదే ఫీజు ఉంటుందా..? మరింత పెంచే అవకాశం ఉంటుందా అనే విషయం తెలియాల్సి ఉంది. నిజానికి ఈ ఏడాది అక్టోబర్ నుంచే కొత్త మద్యం పాలసీ అమలులోకి రాావాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యం,లాక్ డౌన్ల కారణంగా మరో నెల గడువు పెంచింది ప్రభుత్వం.
డిసెంబర్ 1 నుంచి తెలంగాణలో కొత్త మద్యం పాలసీ…!
-