కన్నడ పవర్ స్టార్ మరణం కర్నాటకనే కాకుండా యావత్ దేశాన్ని కదిలించింది. తన సేవలను దేశ ప్రజలు కొనియాడారు. చిన్న వయసులోనే మరణించిడం కన్నడ ప్రజలను కలిచివేసింది. తమ అభిమాన హీరో తిరిగి రాని లోకాలకు వెళ్లాడని ఇప్పటికీక కన్నడ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. యావత్ కర్ణాటక శోకతప్త హ్రుదయాలతో పునీత్ రాజ్ కుమార్ కు అంతిమ వీడుకోలు పలికింది. తను చనిపోతూ కూడా కళ్లు దానం చేసి నలుగురికి వెలుగు ప్రసాదించాడు పునీత్.
ఇప్పుడు అదే కన్నడ నాట ఉద్యమంగా తయారవుతోంది. కర్ణాటకలో విపరీతమైన అభిమానులను కలిగి ఉన్న నటుడు పునీత్ మరణం తర్వాత నేత్రదానం కర్ణాటకలోని ప్రతి ఇంటికి చేరుకుంది. పునీత్ చేసిన ఐ డొనేషన్ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. కోవిడ్ తరువాత కాలం తరువాత ప్రస్తుతం నేత్రదానం చేసే సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మీడియా విస్త్రుత కవరేజీ ఇవ్వడం వల్ల ఐ డొనేషన్ పై ప్రజల్లో చాలా అవగాహన వచ్చింది. పునీత్ కళ్లను సేకరించి నలుగురికి విజయవంతంగా అమర్చిన నారాయణ నేత్రాలయ వ్యవస్థాపకుడు డాక్టర్ భుజంగ శెట్టి .. పునీత్ నేత్రదానంతో ప్రజల్లో కళ్ల దానంపై ఉన్న అపోహలు తొలిగిపోయి, అవగాహన వచ్చిందంటున్నారు. పునీత్ మరణం తర్వాత నుంచి 1500 మంది దాకా తమ కళ్లను దానం చేస్తామని ముందుకు వచ్చారని, ఇప్పటి వరకు 16 మంది మరణిస్తే వారి కళ్లను దానం చేసేందుకు వారి కుటుంబ సభ్యుల ఒప్పుకున్నారని… ఇది ఒక రికార్డ్ అని భుజంగ శెట్టి అన్నారు.
గతంలో కూడా పునీత్ రాజ్ కుమార్ తండ్రి డా. రాజ్ కమార్, తల్లి పార్వతమ్మలు కూడా నేత్రదానం చేశారని గుర్తుచేశారు.