ధాన్యం కొనుగోలు పై మోడీ సర్కార్ న్ టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం కెసిఆర్. ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొంటలేదని.. ఈ విషయం లో దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ ఫైర్ అయ్యారు. యసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం చెబుతోందని పేర్కొన్నారు సిఎం కెసిఆర్.
దేశంలో ఆహార కొరత రాకుండా fci ఏర్పాటైందని.. కేంద్రం బాధ్యత నుంచి తప్పుకుందని తెలిపారు. తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరిగిందని.. 24 గంటల విద్యుత్, రైతు బంధు, రైతు బంధు తో సాధ్యమనీ తెలిపారు సిఎం కేసీఆర్. దాన్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది అని.. అందుకే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.. యాసంగి కాలంలో ఇతర పంటలు వేసుకోవాలని సూచించారనీ చెప్పారు సీఎం కేసీఆర్. రైతుబంధు లాంటి పథకం ఎక్కడా లేదని… ధాన్యాన్ని పూర్తిగా కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. గతంలో పోలీస్‌స్టేషన్లలో ఎరువులు అమ్మేవారని.. ధాన్యాన్ని నిల్వచేసే ఏకైక సంస్థ ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అని తెలిపారు సీఎం కేసీఆర్.