హుజూరాబాద్ ఎన్నికల తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ బీజేపీపై, బండి సంజయ్ పై తీవ్రపదజాలంలో, తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి కేసీఆర్ పై విమర్శలు మొదలయ్యాయి. బీజేపీ నాయకులు కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చే పనిలో ఉన్నారు. బీజేపీ నేత విజయశాంతి కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ’ మాట తప్పితే పది సార్లు మెడలు నరుక్కుంటానని మాట తప్పిన కేసీఆర్… బండి సంజయ్ మెడలు విరుస్తడా..?. ఈ మాటలు హుజూరాబాద్ కు వచ్చి ఎందుకు చెప్పలేదు అని సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విమర్శించారు. మీ తీరును చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఆమె అన్నారు.
పెట్రోల్, డిజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ ను తగ్గించాలన ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణలో అమలు కాని పథకాలపై ఉద్యమిస్తామని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం హమీల హామీల్లాగే దళితబంధు పేరిట కేసీఆర్ దగా చేస్తున్నారని.. ఆయన మెడలు వంచి పథకాలను అమలు చేయించడానికి బీజేపీ పార్టీ ఉద్యమిస్తుందని ఆమె అన్నారు.